Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Job Notification: నాబార్డ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. నెలకు రూ. 70,000 ఇస్తారు

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) పరిచయం అవసరం లేని సంస్థ. ఈ సంస్థ ఇచ్చే వరాల కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. రైతులే కాదు ఇప్పుడు నిరుద్యోగులు కూడా నాబార్డ్ వైపు చూడాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే నాబార్డ్ మీకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ముంబయి లో ఒప్పంద ప్రాతిపదికన పని చేయడానికి 44 యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కావాల్సిన అర్హతలు, ఒప్పంద వివరాలు, జీతాలు ఈ స్టోరీలో సవివరంగా మీకోసం..

యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులను భర్తీకి అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. సంబంధిత డిగ్రీలో మీరు సాధించిన మార్కులు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇంటర్వ్యూలను దేశ వ్యాప్తంగా ఉన్న నాబార్డ్‌ ప్రాంతీయ కార్యాలయాల్లో నిర్వహిస్తారు.

ఖాళీలు ఉన్న విభాగాలు..

1. క్లైమేట్‌ యాక్షన్‌ అండ్‌ సస్టైనబిలిటీ డిపార్ట్మెంట్, 2- ఎకనామిక్స్‌, 3-డేటా సైన్స్‌,4-సైబర్‌ సెక్యూరిటీ, 5-గ్రాఫిక్‌ డిజైనింగ్‌, 6-పీఆర్, 7-ఔట్‌రీచ్‌ అండ్‌ డాక్యుమెంటేషన్‌, 8 - జియోఇన్ఫర్మాటిక్స్‌, 9-డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌,10- ఫైనాన్స్‌, 11-ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌, 12 - యూఐ/యూఎక్స్‌ డిజైనింగ్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌

NABARD to Recruit 44 Young Professionals on Contract Basis

కావాల్సిన విద్యార్హతలు..

ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ లేదా క్లైమేట్‌ సైన్స్‌లో పీజీ డిగ్రీతో పాటు ఏడాది ఉద్యోగానుభవం ఉండాలి. ఎకనామిక్స్‌/ అప్లైడ్‌ ఎకనామిక్స్‌/ ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ డేటాసైన్స్‌/ ఫైనాన్స్‌తో పీజీ డిగ్రీ. ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటాసైన్స్‌ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌. కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ సైబర్‌ సెక్యూరిటీ/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ. అకడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌కు.. ఎడ్యుకేషన్‌/ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ డిగ్రీ. లేదా ఎంబీఏ (హెచ్‌ఆర్‌)/ ఎంఈడీ. డిజిటల్‌ మీడియా/ మల్టీమీడియా/ గ్రాఫిక్‌ డిజైన్‌ డిగ్రీ. పీఆర్, ఔట్‌రీచ్‌ అండ్‌ డాక్యుమెంటేషన్‌కు .. మాస్‌ మీడియా/ డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్‌/ విజువల్‌ కమ్యూనికేషన్‌/ జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ.

ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి వయసు 01.11.2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.11.1995 - 01.11.2004 మధ్య జన్మించినవారు అర్హులు. దరఖాస్తు ఫీజు: రూ.150 గా నిర్ణయించారు. క్వాలిఫై అయిన వారికి స్టైపెండ్‌ నెలకు రూ.70,000 వరకు అందుతుంది. 12.01.2026 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చేసుకోవడానికి అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం కేటగిరీల వారీ తుది ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి 2ఏసీ రైలు ఛార్జీలను చెల్లిస్తారు.

పూర్తి వివరాల కోసం https://www.nabard.org/ ఇక్కడ క్లిక్ చేయండి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+