NCERT TextBooks: సీబీఎస్ఈ 3, 6 తరగతుల టెక్స్ట్ బుక్స్ రిలీజ్ ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా జాతీయ విద్యా పాఠ్యప్రణాళిక ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం కోసం సీబీఎస్ఈ సిలబస్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది సీబీఎస్ఈ కరిక్యులమ్ ప్రకారం గ్రేడ్ 3, గ్రేడ్ 6 చదివే విద్యార్ధులకు అందించే పాఠ్యపుస్తకాల్లో మార్పులు రానున్నాయి. ఈ మేరకు సీబీఎస్ఈ ఆదేశాలతో జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి (NCERT) ఈ రెండు తరగతుల కోసం కొత్త పాఠ్యపుస్తకాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త పుస్తకాలు విద్యార్ధులకు ఎప్పటి కల్లా అందుబాటులోకి వస్తాయన్న దానిపై ఎన్సీఈఆర్టీ ఇవాళ అప్ డేట్ ఇచ్చింది.
జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి వచ్చే విద్యాసంవత్సరం కోసం 3, 6 తరగతుల కోసం కొత్త పాఠ్యపుస్తకాలు సిద్ధం చేస్తోంది. మిగతా క్లాసులకు ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇప్పటికే పాఠ్యపుస్తకాలను స్కూళ్లకు పంపుతోంది. అలాగే మూడో తరగతి పాఠ్యపుస్తకాలను ఈ నెలలోనే స్కూళ్లకు అందించనున్నట్లు ఎన్సీఈఆర్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆరో తరగతి పాఠ్యపుస్తకాలు మాత్రం మే నెలలో అందిస్తామని వెల్లడించింది.

కొత్త సిలబస్ తో పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు,విద్యార్థులు ఓపికగా ఉండాలని ఎన్సీఈఆర్టీ ఓ ప్రకటనలో కోరింది. అలాగే మిగతా తరగతులకు సంబంధించిన 33 లక్షల పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ముద్రణ పూర్తి చేసుకుని దుకాణాలకు కూడా పంపేశారు. అలాగే ప్రతీ ఏటా పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించే విషయంలో తమ నిబద్ధతను ఎన్సీఈఆర్టీ గుర్తు చేస్తోంది. తాజా అంచనాల ప్రకారం 3వ, 4వ, 5వ, 9వ, 11వ తరగతుల పుస్తకాలు ఈ నెలలో మార్కెట్‌లోకి రానుండగా, 6వ తరగతికి సంబంధించిన పుస్తకాలు మేలో రానున్నాయి.












Click it and Unblock the Notifications