NEET-PG 2024 పరీక్షల తేదీ ఇదే

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల తేదీ వెలువడింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ (NBEMS) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది జులై 7వ తేదీన నీట్ పీజీ (NEET PG 2024) పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. పీజీ అర్హత సాధించడానికి కటాఫ్ ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన షెడ్యూల్ అయింది.

నిజానికి- షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది మార్చి 3వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. గత ఏడాది నీట్ పీజీ పరీక్షలు మార్చి 5వ తేదీన జరిగాయి. ఈ ఏడాది కూడా మార్చి 3 లేదా 5 తేదీల్లో ఉంటాయనే అంచనాలు మొదట్లో వెలువడ్డాయి. దీనికి అనుగుణంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమౌతోన్నారు.

NEET-PG 2024 to be conducted on these date

తాజగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకటించిన షెడ్యూల్‌ను బట్టి చూస్తే ఈ ఏడాది మార్చిలో నీట్ పీజీ పరీక్షలు ఉండట్లేదు. అవి జులై 7వ తేదీకి వాయిదా పడినట్టయింది. ఇక నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఈ సంవత్సరం నిర్వహించట్లేదు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023 ఆధారంగా నీట్ పీజీ పరీక్షల తరువాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. గత ఏడాదే ఈ రెగ్యులేషన్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సమగ్ర వివరాల కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+