NEET UG 2026 Re-Exam: నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు-ఎన్టీఏ ప్రకటన..!

దేశవ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష (NEET UG 2026) ప్రశ్నాపత్రం లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ దాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మరో కొత్త తేదీ కోసం పలు సంప్రదింపులు జరిపిన ఎన్టీఏ చివరికి జూన్ 21న తిరిగి పరీక్ష (NEET UG 2026 Re-Exam) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఓ కీలక ప్రకటన చేసింది. దీంతో ఇప్పటికే పరీక్ష రద్దయిందని ఆందోళనలో ఉన్న విద్యార్ధులకు ఊరట దక్కినట్లయింది.

రాజస్థాన్ లోని సికార్ లో గెస్ పేపర్ పేరుతో సర్కులేట్ అయిన నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్ధుల ఉసురుతీసింది. ఈ లీక్ తో మరోసారి ఇరుకునపడ్డ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో వెంటనే రీఎగ్జామ్ నిర్వహించడం ద్వారా ఈ విమర్శల నుంచి కొంత వరకూ బయటపడొచ్చని భావిస్తున్న ఎన్టీఏ ఇవాళ రీఎగ్జామ్ తేదీని ప్రకటించింది. కేంద్రం ఆమోదంతో ఎన్‌టీఏ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. నీట్-యూజీ 2026 పునఃపరీక్షను ఇప్పుడు జూన్ 21 ఆదివారం రోజు నిర్వహిస్తారు.

NEET UG 2026 Re-Exam Scheduled for June 21 Here s What Students Need to Know

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా న్యూఢిల్లీలోని 19 తీన్ మూర్తి మార్గ్‌లో ఉదయం 10.30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి నీట్ పరీక్షపై మీడియాకు వివరించనున్నారు.ప్రశ్నాపత్రాల లీకేజీ, అవకతవకల ఆరోపణల కారణంగా పరీక్షల ప్రయాణానికి అంతరాయం ఏర్పడిన దాదాపు లక్షలాది మంది వైద్య విద్యార్థుల వారాల తరబడి అనిశ్చితి తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ వివాదం భారతదేశంలోని అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన నీట్ విశ్వసనీయత, భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+