NVS 2024 : నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్‌..

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. న‌వోద‌య విద్యాల‌య స‌మితిలో నాన్‌టీచింగ్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 1377 నాన్‌టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోయిడాలోని ఎన్‌వీఎస్‌ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్‌వీఎస్‌ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్‌ఎల్‌ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీక‌రించ‌నుంది. అర్హ‌త‌, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో తరగతి, ఇంట‌ర్ సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం క‌లిగి ఉన్న వారికి ప్రాధాన్య‌త ఇస్తారు. ఈ పోస్టుల‌కు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్య‌ర్థులను ఎంపిక చేస్తారు.

NVS 2024 Non-Teaching Recruitment in Navodaya Vidyalayas

పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ మొత్తం పోస్టులు : 121

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తం పోస్టులు : 5

ఆడిట్ అసిస్టెంట్ మొత్తం పోస్టులు : 12

జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ మొత్తం పోస్టులు : 4

లీగల్ అసిస్టెంట్ మొత్తం పోస్టులు : 1

స్టెనోగ్రాఫర్ మొత్తం పోస్టులు : 23

కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం పోస్టులు : 2

క్యాటరింగ్ సూపర్‌వైజర్ మొత్తం పోస్టులు : 78

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మొత్తం పోస్టులు : 381

ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ మొత్తం పోస్టులు : 128

ల్యాబ్ అటెండెంట్ మొత్తం పోస్టులు : 161

మెస్ హెల్పర్ మొత్తం పోస్టులు : 442

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మొత్తం పోస్టులు : 19

మొత్తం పోస్టుల సంఖ్య : 1,377

రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, స‌ర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి ప‌దో తరగతి, ప‌న్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న‌వారిని ఈ పోస్టుల‌కు ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేయాల‌నుకునే వారు దరఖాస్తు రుసుము జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500 (ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు) ఇత‌ర పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునేవారికి రూ.1000 ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 500 రూపాయ‌లు మాత్ర‌మే. ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు కేంద్రీయ విద్యాలయ సమితి .https://navodaya.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష తేదీల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప‌రీక్ష కేంద్రాలివే.. అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+