ఎన్నో ఏళ్ల చీకటికి పొద్దు పొడిచేది ఎప్పుడో.. గ్రూప్స్ అభ్యర్ధుల ఎదురుచూపు ఇంకెన్నాళ్లు ?

ఎన్నో ఏళ్ల చీకటికి పొద్దు పొడిచేది ఎప్పుడో అనే రీతిలో తెలంగాణలో గ్రూప్స్ అభ్యర్ధుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంటుంది. టీజీపీఎస్సీ గ్రూప్స్‌ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి చదువుతూ ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్ధుల ఎదురుచూపులకు ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ఉద్యోగాల భర్తీలో మరోసారి జాప్యం తప్పదనే పరిస్థితి ఏర్పడడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కష్టపడి పరీక్షలు రాసినా.. ఫలితాలు వచ్చినా.. ఉద్యోగం చేతిలో పడే రోజు మాత్రం ఇంకా దూరంగా ఉన్నట్టే కనిపిస్తోంది. కోర్టు కేసులు, పాలసీ జాప్యాలతో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్- 4 నియామకాల్లో ఆలస్యం కావడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత మరోసారి నిరాశలో మునిగిపోతున్నారు.

కోర్టు తీర్పు తర్వాతే..

గ్రూప్‌-1 కేటగిరీలో 503 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ వెలువడింది. రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించినప్పటికీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాలతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పోస్టుల సంఖ్యను 563కు పెంచి టీజీపీఎస్సీ ద్వారా 2024 ఫిబ్రవరిలో కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

reasons-behind-group-aspirants-struggles-in-telangana-and-delay-process

ఈ క్రమంలోనే గత ఏడాది జూన్‌లో ప్రిలిమినరీ పరీక్షలు, అక్టోబర్‌లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదలతోపాటు తుది జాబితాను ప్రకటించింది. అయితే మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియలో తప్పులు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లటంతో భర్తీ ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది.

అయితే పైస్థాయి నుంచి కింది స్థాయికి ఉద్యోగాల భర్తీ చేపట్టి పూర్తిస్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. అందుకే గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు నడుస్తుండడంతో.. వచ్చే నెలలో సెలవులు ముగిసిన తర్వాత గ్రూప్‌-1పై విచారణ ప్రక్రియ వేగం అందుకోనుందని భావిస్తున్నారు. న్యాయస్థానం తుది తీర్పు వచ్చిన వెల్లడించిన తర్వాత ఉద్యోగాల నియామకాల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడు వరుసగా గ్రూప్‌-2, గ్రూప్‌-3 నియామకాలకూ మార్గం సుగమమవుతుందని.. అప్పటివరకు వేచి చూడక తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి.

మరోవైపు గతేడాది డిసెంబర్‌లో గ్రూప్‌-4 కేటగిరీలో 8,180 ఉద్యోగాలను కమిషన్‌ భర్తీ చేసింది. ప్రస్తుతం వాళ్లంతా విధులు నిర్వహిస్తుండగా.. నాడు అవరోహణ విధానాన్ని పాటించకపోవడం వల్ల, ఎగువ స్థాయి పోస్టుల భర్తీలో కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ఇప్పటికీ ఈ ప్రభావం పరోక్షంగా గ్రూప్‌-1, 2, 3 నియామకాలపై పడుతోందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ప్రభుత్వాల మార్పు, నిర్వహణ లోపం, కోర్టు కేసుల వల్ల లక్షలాది మంది అభ్యర్థుల ఆశలు ఆశల గానే మిగిలిపోతున్నాయని వాపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+