CBSE విద్యార్థులకు బిగ్ అలర్ట్! దరఖాస్తు గడువు పొడిగింపు

సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు బోర్డు అదనపు సమయాన్ని ఇచ్చింది. జవాబు పత్రాల వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ (పునఃమూల్యాంకనం) కోసం దరఖాస్తు చేసుకునే గడువును మరో రోజు పొడిగిస్తూ బోర్డు అధికారిక నిర్ణయం తీసుకుంది. జూన్ 6వ తేదీతో ముగియాల్సిన ఈ గడువును, జూన్ 7 అర్ధరాత్రి వరకు పొడిగించారు. జూన్ 2న ప్రారంభించిన పోస్ట్-రిజల్ట్ సర్వీసెస్ ఆన్‌లైన్ పోర్టల్‌లో తీవ్రమైన సాంకేతిక సమస్యలు తలెత్తడం, దానివల్ల విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడటంతో బోర్డు ఈ సడలింపు ఇచ్చింది.

"విద్యార్థుల ఇబ్బందులను, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 12వ తరగతి బోర్డు పరీక్షల వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని పొడిగించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులకు ఈ ప్రక్రియను ఎలాంటి ఆందోళన లేకుండా పూర్తి చేయడానికి అదనపు సమయం, మద్దతు లభిస్తుంది" అని బోర్డు తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. విద్యార్థులు ఈ సవరించిన షెడ్యూల్‌ను గమనించి తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది.

Relief For Board Students As CBSE Class 12 Re Evaluation Registration Deadline Extended To June 7

సమస్యలను రిపోర్ట్ చేసేందుకు ఛాన్స్..

తమకు వచ్చిన మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థుల కోసం బోర్డు మంగళవారం ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో విద్యార్థులు తమ స్కాన్ చేసిన జవాబు పత్రాలను స్వయంగా పరిశీలించుకోవచ్చు. ఒకవేళ ఆ జవాబు పత్రాల్లో పేజీలు కానీ, మ్యాప్‌లు/గ్రాఫ్‌లు కానీ మిస్ అయినా, స్కానింగ్ సరిగ్గా లేక అస్పష్టంగా కనిపించినా, లేదా తప్పుడు ప్రశ్నపత్ర సెట్లకు మార్కులు వేసినట్లు గమనించినా.. వాటిని బోర్డు దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకునేందుకు ఈ పోర్టల్ ద్వారా అవకాశం కల్పించారు.

CBSE గుట్టు విప్పిన క్లాడ్ ఏఐ! పోర్టల్‌లో తీవ్ర భద్రతా లోపాలు?
CBSE గుట్టు విప్పిన క్లాడ్ ఏఐ! పోర్టల్‌లో తీవ్ర భద్రతా లోపాలు?

చేతిరాత వివాదం.. దర్యాప్తునకు కమిటీ!

ఆన్‌లైన్ మూల్యాంకనం (OSM) పై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్డు అప్‌లోడ్ చేసిన జవాబు పత్రాల్లోని చేతిరాత అసలు తమది కానే కాదని పలువురు 12వ తరగతి విద్యార్థులు ఆరోపించడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థలో దొర్లిన తప్పుల వల్లే ఇలా జరిగిందని విమర్శలు వస్తున్నాయి.

కుప్పకూలిన CBSE వ్యవస్థ.. ఐఐటీ నిపుణుల రంగప్రవేశం!
కుప్పకూలిన CBSE వ్యవస్థ.. ఐఐటీ నిపుణుల రంగప్రవేశం!

ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. సీబీఎస్‌ఈకి చెందిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థ సేవల సేకరణలో జరిగిన లోపాలపై నిజా నిజాలను తేల్చేందుకు 'క్యాబినెట్ సెక్రటేరియట్' ఆధ్వర్యంలో ఒక సభ్యునితో కూడిన ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సాంకేతిక సమస్యలు, వివాదాల మధ్య విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు గడువు పెంచిన బోర్డు, మరోవైపు తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+