ఆర్ఆర్‌బీ బంపర్ ఆఫర్.. భారీ జీతంతో ఉద్యోగాలు !!

దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా గల అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 పోస్టులతో సెక్షన్‌ కంట్రోలర్‌ (సీఈఎన్ నెం.04/2025) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడానికి గడువు ప్రారంభం అవ్వగా.. అక్టోబర్‌ 14 వరకు ఆన్‌ లైన్‌ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...

మొత్తం ఖాళీలు..

368

పోస్టుల వివరాలు..

సెక్షన్‌ కంట్రోలర్‌

యూఆర్: 174 పోస్టులు

ఎస్సీ: 56 పోస్టులు

ఎస్టీ: 34 పోస్టులు

ఓబీసీ: 80 పోస్టులు

ఈడబ్ల్యూఎస్: 24 పోస్టులు

rrb-notification-for-368-vacancies-for-section-controller-posts

దరఖాస్తు గడువు..

సెప్టెంబర్ 15, 2025 నుంచి అక్టోబర్ 14, 2025 వరకు

దరఖాస్తు విధానం..

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

వయస్సు..

  • 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • రిజర్వేషన్ వర్గాలకు వయస్సు సడలింపు:
  • OBC అభ్యర్థులకు - 3 సంవత్సరాలు
  • SC/ST అభ్యర్థులకు - 5 సంవత్సరాలు
  • దివ్యాంగ అభ్యర్థులకు - 10 సంవత్సరాలు

విద్యార్హత..

డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నియామక ప్రక్రియ..

  • ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది.
  • CBTలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • ఫైనల్‌గా అన్ని అర్హతలు పూర్తి చేసిన వారిని నియామకం చేస్తారు.

జీతం & సౌకర్యాలు..

  • ఎంపికైన వారికి నెలకు రూ.35,400 వరకు ప్రాథమిక జీతం లభిస్తుంది.
  • అదనంగా, డిఏ, హెచ్ఆరేఏ, ట్రావెల్ అలవెన్సులు వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి.
  • రైల్వే ఉద్యోగులకు ఉచిత లేదా తక్కువ ధరలో ప్రయాణ సదుపాయం, మెడికల్ ఫెసిలిటీలు కూడా లభిస్తాయి.

పోస్టులు లభించే జోన్లు..

అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్‌పూర్, తిరువనంతపురం రీజియన్లలో పోస్టులు భర్తీ చేయబడతాయి.

దరఖాస్తు ఫీజు..

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 ఫీజు
  • ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 ఫీజు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+