తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు 30న: హాల్‌టికెట్లు ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్: పోలీసు శాఖలోని వివిధ విభాగాల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం తుది రాత పరీక్ష ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, సరిసర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కమ్యూకేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది రాత పరీక్ష ఉంటుంది.

 tspolice-

కాగా, సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ రెండు పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకే పరీక్ష కేంద్రాన్ని కేటాయించనున్నట్లు పోలీస్ నియామక మండలి ఛైర్మన్ తెలిపారు. కానిస్టేబుల్ తుది రాత పరీక్ష హాల్ టికెట్లను అభ్యర్థులు ఏప్రిల్ 24న ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అభ్యర్థులు www.tslprb.com వెబ్‌సైట్‌లో హాల్‌‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఉన్న అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఏఈఈ సివిల్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలోనే: టీఎస్‌పీఎస్సీ క్లారిటీ

ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(TSPSC) కీల‌క నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వహించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

మే 21న ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే.. ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చర్, మెకానిక‌ల్ పోస్టుల‌తో పాటు సివిల్ పోస్టుల‌కు కూడా ఆన్‌లైన్ విధానంలోనే రాత‌ప‌రీక్ష నిర్వహించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.

మే 21, 22 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మే 8న ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించ‌నున్నారు.

ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్‌ లీకేజీ కారణంగా కమిషన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1,540 పోస్టుల భర్తీకి ఏఈఈ నోటిఫికేషన్‌ను 2022 సెప్టెంబర్‌ 3న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు 44,352 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+