తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆఫ్‌లైన్‌లోనే
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రకటించింది. ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష ఉంటుందని తెలిపింది. గ్రూప్-1 కోసం దాదాపు 4 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
మార్చి 23 నుంచి 27 వరకు సవరణకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తం 4లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు దరఖాస్తు చేసుకున్నారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే 4 గంటల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నవోదయలో 1377 ఉద్యోగాలు: మే 7 వరకే గడువు
దేశంలోని నవోదయ విద్యాలయాల్లో బోధనేతర (నాన్ టీజింగ్) సిబ్బంది నియామకానికి దరఖాస్తుల గడువును నవోదయ విద్యాలయ సమితి పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30తోనే గడువు ముగియగా.. మే 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 1377 నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .
దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications