తెలంగాణ ఈఏపీసెట్ 2025 రిజిస్ట్రేషన్ వాయిదా.. ఆ రోజు నుంచి అప్లై
తెలంగాణ ఈఏపీసెట్ 2025 రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా వేశారు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జేఎన్‌టీయూ హైదరాబాద్ ఫిబ్రవరి 20న టీజీ ఈఏపీసెట్ / ఎంసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది. విద్యార్థులు పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in/ సైట్ ను సందర్శించవచ్చు.
కోర్సులు: ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్/ బీటెక్ (బయో-టెక్నాలజీ)/ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)/ బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (ఫారెస్ట్రీ)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ, ఫార్మ్-డీ, బీఎస్సీ (నర్సింగ్).
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ విడుదల : మార్చి 1, 2025
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 04, 2025 వరకు (ఆలస్య రుసుము లేకుండాల)
దరఖాస్తుల్లో తప్పుల సవరణ : ఏప్రిల్ 06 నుంచి 08 వరకు
రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు ఛాన్స్ : ఏప్రిల్ 9 వరకు అవకాశం
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు ఛాన్స్ : ఏప్రిల్ 14 వరకు అవకాశం
రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు ఛాన్స్ : ఏప్రిల్ 18 వరకు అవకాశం
రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు ఛాన్స్ : ఏప్రిల్ 24 వరకు అవకాశం
హాల్‌టికెట్లు విడుదల: ఏప్రిల్ 19, 2025
దరఖాస్తు ఫీజు: రూ.900 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500).. రెండు స్ట్రీమ్‌లకు రూ.1,800 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.1000) చెల్లించాల్సి ఉంటుంది.
అర్హత: ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
వయసు : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరాలంటే 2025 డిసెంబరు 31 నాటికి 16 ఏళ్లు నిండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు. అయితే బీటెక్ డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్‌కు 17 ఏళ్లు (2025 డిసెంబరు 31 నాటికి) నిండాలి. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీలకు 25, ఇతరులకు 22 ఏళ్లు గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయించారు.

పరీక్ష తేదీలు: ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు, మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో 16 పరీక్ష జోన్లు ఏర్పాటు చేశారు. ఏపీలో కర్నూలు, విజయవాడ నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications