AP Govt: ఆయుష్ వైద్యానికి ఏపీ గుర్తింపు-7 కేటగిరీల్లో ఆస్పత్రులు-రూల్స్ ఇవే..!

ఏపీలో తొలిసారి ఆయుష్ వైద్యానికి కూడా అల్లోపతితో సమానంగా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం (AP Govt)నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణలు చేయడంతో పాటు ఆయుష్ వైద్యం అందిస్తున్న ఆస్పత్రులను ఏడు కేటగిరీలుగా వర్గీకరించి రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయుష్ ఆస్పత్రులు (Ayush Hospitals) పాటించాల్సిన విధివిధానాలు, ఇతర నిబంధనలతో కూడిన ముసాయిదాను ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ప్రజలు, మేథావుల నుంచి అభిప్రాయాలు ఆహ్వానిస్తోంది.

ప్రస్తుతం ఏపీలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్‌ క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్‌ హోమ్‌లు, ఆసుపత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. చిన్న క్లినిక్‌ నుంచి 200 పడకలకు పైబడిన ఆసుపత్రి వరకు ప్రతి ఆయుష్‌ ప్రైవేట్‌ వైద్య సంస్థ నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. అర్హత లేని వ్యక్తులు నిర్వహించే నకిలీ వైద్య కేంద్రాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు రోగులకు నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముసాయిదా నిబంధనలను తయారుచేసి ఇవాళ విడుదల చేశారు. సూచనలు, సలహాలు పరిశీలించిన అనంతరం కొత్త నిబంధనలు జారీ చేస్తామని మంత్రి సత్యకుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు.

AP Govt Releases Draft Rules for Private AYUSH Hospitals Introduces 7 Registration Categories
DSC పోరులో వైసీపీకి షాక్ ..! తేల్చేసిన ఏపీ హైకోర్టు ..!
DSC పోరులో వైసీపీకి షాక్ ..! తేల్చేసిన ఏపీ హైకోర్టు ..!

ఇప్పటివరకు అల్లోపతి ప్రైవేట్‌ వైద్య సంస్థలకు మాత్రమే వర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం-2002ను ప్రభుత్వం సవరించి అందులో ఆయుష్ వైద్యాన్ని కూడా చేర్చింది. ఏప్రిల్‌ 10న ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేష్‌ విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిబంధనల్ని పరిశీలింంచి ముసాయిదా తయారు చేశారు. దీని ప్రకారం
రాష్ట్రంలోని అన్ని ఆయుష్ వైద్యం అందించే ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అవి అందిస్తున్న సేవలు, పడకల సామర్థ్యం ఆధారంగా ఏడు విభాగాలుగా వర్గీకరించారు. సింగిల్‌ డాక్టర్‌ క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, 20 పడకలలోపు ఆసుపత్రులు, 21 నుంచి 50 పడకలు, 51 నుంచి 100 పడకలు, 101 నుంచి 200 పడకలు, 200 పడకలకు పైబడిన ఆసుపత్రులుగా వీటిని విభజించారు. ఒకే సంస్థలో ఒకటి కంటే ఎక్కువ వైద్య సేవలు అందిస్తుంటే ప్రతి కేటగిరీ కింద విడిగా నమోదు చేసుకోవాలి.

AP Govt Releases Draft Rules for Private AYUSH Hospitals Introduces 7 Registration Categories
ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!
ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు సమర్పిస్తే. 90 రోజులపాటు చెల్లుబాటయ్యే తాత్కాలిక నమోదు ధ్రువపత్రాన్ని జారీ చేస్తారు. నిర్దేశించిన ప్రమాణాలన్నీ పాటించినట్లు పరిశీలనలో తేలితే ఐదేళ్లపాటు చెల్లుబాటయ్యే శాశ్వత నమోదు ధ్రువపత్రాన్ని మంజూరు చేస్తారు. శాశ్వత నమోదు గడువు ముగియడానికి 3 నెలల ముందే పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలి. పునరుద్ధరణ దరఖాస్తుపై మూడు నెలల్లో అధికారులు నిర్ణయం తీసుకోకపోతే అది ఆటోమేటిగ్గా పునరుద్ధరణ జరిగేలా ముసాయిదాలో ప్రతిపాదించారు. తనిఖీల్లో లోపాలు గుర్తిస్తే ఏడు రోజుల్లో సంబంధిత సంస్థకు సమాచారం ఇస్తారు. వాటిని సరిచేసుకునేందుకు రెండు నెలల గడువు కల్పిస్తారు. నిర్ణీత సమయంలో లోపాలను సరిచేయకపోతే నమోదు రుసుములో 50 శాతం జరిమానా విధించి మరో నెల అవకాశం ఇస్తారు. అప్పటికీ ప్రమాణాలు పాటించకపోతే తాత్కాలిక నమోదును రద్దు చేస్తారు. సలహాలు, సూచనలకు కోసం ముసాయిదాను ఆయుష్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ayush.ap.gov.in లో అందుబాటులో ఉంచారు. [email protected] ద్వారా కూడా సూచనలు అందించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+