రేపే టీఎస్ ఇంట‌ర్ ఫ‌లితాలు.. ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల డేట్ వ‌చ్చేసింది..!

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల తేదీలు వ‌చ్చేసాయ్‌. రేపు (ఏప్రిల్ 24) బుధ‌వారం టీఎస్ ఇంట‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్న‌ట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులు ఫలితాల కోసం ఈ వెబ్‌సైట్ లింక్‌లో https://tsbie.cgg.gov.in తో పాటు https://telugu.abplive.com/ చెక్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. రేపు ఉద‌యం 11 గంటలకు ఇంట‌ర్ ఫ‌లితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫ‌లితాల‌ను విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు.

రాష్ట్రంలో ఇంట‌ర్‌మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇక‌, ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో, 4,78,527 మంది ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యర్థులు ఉండ‌గా, విద్యార్థులు ఉండ‌గా, 4,43,993 మంది సెంకండ్ ఇయ‌ర్ విద్యార్థులు ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ఫ‌స్ట్ ఇయ‌ర్ 48,277 మంది విద్యార్థులు ఉండ‌గా, ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

Tomorrow TS Inter results 10th class results date has arrived

ఏప్రిల్ 30న ప‌ది ఫ‌లితాలు విడుద‌ల‌..

టీఎస్ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 30న (మంగళవారం) విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు గ‌త‌నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు ఉండ‌గా, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ప‌రీక్ష‌ల జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 3 నుంచి ప్రారంభించారు. ఈ నెల 20తో మూల్యాంకనం పూర్తైంది. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇక‌, ఈ నెల 30న ప‌ది ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు విద్యాశాఖ తెలిపింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప‌ది ఫ‌లితాల‌ను విడుదల చేస్తారు. ఈ విష‌యాన్ని తెలంగాణ‌ ఎస్ఎస్ సీ బోర్డు అధికారికంగా కూడా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+