TSPSC: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు...
టీఎస్‌పీఎస్‌సీ ఫిబ్రవరి 19న 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు గడువు నిన్నటితో అంటే మార్చి 14తో ముగిసింది. అయితే, టీఎస్‌పీఎస్‌సీ అభ్యర్థులకు మరో రెండురోజులపాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రూప్-1 పోస్టుల దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. మార్చి 16 వతేది సాయంత్రం వరకు అభ్యర్థులు గ్రూప్ 1 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు.
ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ కాగా, 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మార్చి 14 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అయితే, ఈ నెల 13 వరకు 2.70 లక్షల మంది ఈ పోస్టులకు అప్లయ్ చేసుకున్నారు. దీంతో అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ మరో అవకాశం కల్పించింది. మార్చి 16వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. దరఖాస్తు ఫీజు రూ.320 చెల్లించి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు 200రూపాయలు కాగా, పరీక్ష ఫీజు 120రూపాయలు చెల్లించాలి. ఇక, ఈ ఫీజు చెల్లింపులో నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. గతంలో గ్రూప్-1 నోటిఫికేషన్‌కు అప్లయ్ చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని టీఎస్‌పీఎస్‌సి వివరించింది. వారు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపింది.

జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష...
డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక, ఈ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పిఎస్‌సి అధికారులు తెలిపారు. మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలు అబ్జెక్టివ్ తరహా విధానంలో మాత్రమే ఉంటాయి. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయానికి నాలుగు గంటల ముందువరకు అభ్యర్థులకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.












Click it and Unblock the Notifications