Udyami mitra yojana:ఇటు యువతకు ఉద్యోగాలు..అటు ఇన్వెస్టర్ల సమస్యలకు చెక్..!

ఉత్తర్ ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు యోగీ ప్రభుత్వం ఉద్యమి మిత్ర యోజన పథకంను తీసుకొచ్చింది.

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు యోగీ ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ పథకం పేరు యూపీ సీఎం ఉద్యమి మిత్ర యోజన.ఇన్వెస్టర్లకు సహాయం చేసేందుకు ఒక మిత్రుడిని నియమించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.ఇక ఈ పథకంకు అప్లయ్ చేసుకోవాలనుకునే వారు https://oims.org.in/App ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి మార్చి 9 వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.ఈ ఎంట్రప్రెన్యూర్ ఫ్రెండ్స్‌ను వారి చదవు, పని అనుభవం ఇతర అర్హతల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.ఇందుకోసం అప్లయ్ చేసుకునే అభ్యర్థులకు 50 మార్కుల వెయిటేజీ కూడా ఇవ్వాలని యోగీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీనికోసం ఇంటర్వ్యూలు, కంప్యూటర్ టెస్టు కూడా నిర్వహిస్తారు.

ముఖ్యమంత్రి ఉద్యమి మిత్ర యోజన కింద ఎంట్రప్రెన్యూర్ ఫ్రెండ్స్‌ను ఎంపిక చేయడంలో 50 మార్కుల వెయిటేజీని పరిగణలోకి తీసుకుంటున్నారు. వీటిని A,B,C,D అనే నాలుగు కేటగిరీల్లో విభజించారు. ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులను ఏ కేటగిరీ కింద విభజించడం జరిగింది. 60శాతం మార్కులతో పాసైన అభ్యర్థులకు 10 మార్కుల వెయిటేజీని కేటాయించారు.

అదే 70శాతం మార్కులతో పాసైన అభ్యర్థులకు 15 మార్కులు, 75శాతంతో పాసైన అభ్యర్థులకు 17.50 మార్కులు, 80 శాతంతో పాసైన అభ్యర్థులకు 20 మార్కుల వెయిటేజీని కేటాయించారు. ఇక బీ కేటగిరీలో 5 మార్కుల వెయిటేజీని ఇతర అర్హతల ఆధారంగా కేటాయించారు. ఇందులో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అయిన ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్శిటీలు, స్టేట్ యూనివర్శిటీలు, ఎన్‌ఐటీల్లో ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులకు 3 మార్కులు వెయిటేజీని ఇవ్వాలని నిర్ణయించింది.

Udyami mitra yojana:Yogi Adityanath govt to appoint entrepreneur friends to solve investors problems,details here

ఇదిలా ఉంటే పని అనుభవం ఆధారంగా మొత్తం 20 మార్కుల వెయిటేజీని అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. దీన్ని సీ కేటగిరీ కింద విభజించారు. పని అనుభవం ఏడాది కంటే ఎక్కువగా రెండేళ్ల కంటే తక్కువగా ఉంటే 10 మార్కులు వెయిటేజీని కేటాయించగా... రెండేళ్లు కంటే ఎక్కువగా మూడేళ్ల కంటే తక్కువగా ఉన్నవారికి 15 మార్కులు, మూడేళ్లు లేదా అంతకు మించి పని అనుభవం ఉన్నవారికి 20 మార్కుల వెయిటేజీని కేటాయించారు. ఇక చివరిగా డీ కేటగిరీలో ఇంటర్వ్యూ మరియు కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది.

ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయించగా, కంప్యూటర్ టెస్టుకు 10 మార్కులు కేటాయించారు. టాప్ కంపెనీలైన ఫార్చూన్ గ్లోబల్, ఎకనామిక్ టైమ్స్, ఫోర్బ్స్ గ్లోబల్, లేదా ఆసియాలోనే టాప్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి 5 పాయింట్ల వెయిటేజీనీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ప్రామాణికాలన్నీ పరిగణలోకి తీసుకుని వేకెన్సీలను ప్రకటించడం జరుగుతుంది. ఇక అభ్యర్థులను ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూ, కంప్యూటర్ టెస్ట్‌లకు పిలవడం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+