యూజీసి నెట్ 2024 జూన్ సెషన్ నోటిఫికేషన్ విడుదల... దరఖాస్తు ప్రారంభం..
యూజీసి నెట్ 2024 జూన్ సెషన్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. యూజీసి నెట్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. పీజీలో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షకు అప్లయ్ చేసుకోగలరు. ఈ పరీక్షను దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఏడాదిలో రెండు సార్లు నిర్వహిస్తారు. పీజి చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ ప రీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
యూజీసి నెట్ (జూన్)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. యూజీసీ నెట్ జూన్ - 2024 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 20న ప్రారంభమైంది. మే 12న రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు రూ. 1150 చెల్లించాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్) అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్రూ అభ్యర్థులు రూ. 325 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. రెండు షిప్టుల్లో పరీక్ష ఉండనుంది. మొదటి షిప్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 16న యూజీసీ నెట్-2024 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
పరీక్ష విధానం..
ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది. పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులు, 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.
పేపర్ 1లో ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటాయి.












Click it and Unblock the Notifications