రూ.93,960 జీతంతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్ !
దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త ప్రకటించింది. ముంబైలో 250 వెల్త్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఎంపికైన వారికి భారీ వేతనం కూడా లభిస్తుంది. కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మాత్రం ఈరోజు ( ఆగస్టు 25, 2025 ) లాస్ట్ డేట్ కావడంతో అభ్యర్ధులు త్వరపడాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
నోటిఫికేషన్ వివరాలు..
మొత్తం పోస్టులు..
250
పోస్ట్ పేరు..
వెల్త్ మేనేజర్
విద్యార్హత..
MBA / PGDM / PGDBA / PGDBM / PGDFAలో పాస్ కావాలి.

అనుభవం..
సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు పరిమితి..
కనీసం: 25 సంవత్సరాలు
గరిష్టం: 35 సంవత్సరాలు
వయస్సు సడలింపు:
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
SC / ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
దివ్యాంగులకు: 10 సంవత్సరాలు
జీతం & ప్రయోజనాలు..
ఎంపికైన వారికి నెలకు రూ.68,820 నుంచి రూ.93,960 వరకు జీతం లభిస్తుంది.
బ్యాంక్ ఉద్యోగులకు లభించే ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.
స్థిరమైన ఉద్యోగంతో పాటు కెరీర్ గ్రోత్, ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు గడువు..
2025 ఆగస్టు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవ్వగా.. 2025 ఆగస్టు 25 తో ముగియనుంది.
ఎంపిక విధానం..
అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు:
లిఖిత పరీక్ష
గ్రూప్ డిస్కషన్ (GD)
వ్యక్తిగత ఇంటర్వ్యూ (PI)
ఈ మూడు రౌండ్లలో ఉత్తీర్ణులు కావడం ద్వారా ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది.
దరఖాస్తు విధానం..
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.unionbankofindia.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు వ్యక్తిగత వివరాలు, విద్యార్హత సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం స్కాన్ కాపీలు అప్లోడ్ చేయాలి.
- చివరగా అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి.
- అప్లై చేయదలచిన వారికి సూచనలు
- అర్హత, అనుభవం ఉన్నవారు వెంటనే అప్లై చేయాలి.
- చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు రావచ్చు కాబట్టి ముందుగానే అప్లికేషన్ పూర్తి చేయడం మంచిది.
- సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో ఉపయోగం కోసం దాచుకోవాలి.












Click it and Unblock the Notifications