ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో ప్రమాదం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు.ప్యాన్‌ ఇండియా మూవీగా 'దేవర'తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదల వద్ద షూటింగ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడికి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఉన్నారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతోంది. దేవర సినిమాను దసరాకు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Accident in the shooting of NTR Devara

ఇక ఈ ఏడాదే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వార్-2 సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. వార్-2తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీయబోయే కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఎంపికైయ్యారని గుస గుసలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+