ప్రముఖ నటుడి కారు భీభత్సం.. నలుగురికి తీవ్రగాయాలు
ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా తెలుగు ఆడియన్స్ కి సుపరిచితుడే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య, కమల్ హాసన్ నటించిన భారతీయుడు-2, రవితేజ నటించి డిస్కోరాజా, రజాకార్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సహాయ పాత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు సైతం అవార్డు దక్కించుకొని మంచి గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన కారుతో భీభత్సం సృష్టించి వార్తల్లో నిలిచారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నటుడు బాబీ సింహా కారు ఎక్కడుతంగల్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళుతుంది. ఈ క్రమంలో అలందూర్ మెట్రో స్టేషన్ వైపు ఉన్న కత్తిపార ప్లైఓవర్ దిగుతుండగా కారు అదుపుతప్పి ముందుకు వెళ్తున్న వాహనాల పైకి దూసుకువెళ్లింది.

ఈ ఘటనలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు సహా ఆరు వాహనాలు దెబ్బతినగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే వచ్చి క్షతగాత్రులకు సాయం చేశారు. మరోవైపు పోలీసులకు, అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు.
ఇక తీవ్ర గాయాలపాలైన నలుగురు వ్యక్తులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. బీభత్సం సృష్టించిన కారు నటుడు బాబీ సింహది అని తేల్చారు. అంతే కాకుండా కారు నడిపిన డ్రైవర్ పుష్పరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో కారులో బాబీ సింహ లేరని పోలీసులు వెల్లడించారు. అలాగే డ్రైవర్ మద్యం సేవించి కారు నడిపాడని.. అందువల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు డ్రైవర్ పుష్పరాజ్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తుచేస్తున్నట్టు వివరించారు.












Click it and Unblock the Notifications