సినిమా ఇండస్ట్రీలో అన్యాయాలు బయటికి రావు.. స్టార్ హీరోల కూతుళ్లు అందుకే రారు..!

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు "జేడీ చక్రవర్తి". తన సినీ ప్రయాణాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివతో ప్రారంభించారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అనంతరం సత్య, కంపెనీ, ఏక్ హసీనా థీ వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా హోమం వంటి చిత్రాలను తెరకెక్కించారు.

కాగా సినిమాల్లోనే కాకుండా వ్యక్తిత్వంలో కూడా జేడీ చక్రవర్తి ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచారు. ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయకుండా, తనకు అనిపించిన విషయాన్ని ధైర్యంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఈ స్వభావం వల్లే ఆయన తరచూ వివాదాల్లోనూ నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి తన ముక్కుసూటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని "చీకటి కోణాలు" గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.

actor-jd-chakravarthy-made-sensational-comments-on-film-industry-and-star-heros-goes-viral

"చీకటి కోణాలు"పై సంచలన వ్యాఖ్యలు..

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతాయని.. అవి బయటకు రావని తెలిపారు. తెలిసినవాళ్లు కూడా మాట్లాడడానికి భయపడతారని.. అందుకే పెద్ద హీరోలు కూడా తమ కూతుళ్లు ఈ రంగంలోకి రావడాన్ని ఇష్టపడరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రంగంలో అవకాశాలు ఉన్నప్పటికీ, సురక్షిత వాతావరణం అందరికీ ఉండదని ఆయన సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే యువతులు జాగ్రత్తగా ఉండాలని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్టుగా భావిస్తున్నారు.

రాధికా వ్యాఖ్యలకు మద్దతు..

జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు గతంలో రాధికా శరత్‌కుమార్ చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చాయి. ఆమె కూడా తన భర్త శరత్‌కుమార్ తమ కుమార్తెను సినీ రంగంలోకి రానివ్వలేదని వెల్లడించారు. పరిశ్రమలోని పరిస్థితుల వల్లే తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అప్పట్లో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి. ఇక ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో స్థానిక అమ్మాయిలకు తగిన అవకాశాలు దక్కడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇతర భాషల నటీమణులకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయనే వాదనల మధ్య జేడీ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత పొందాయి.

ప్రస్తుతం జేడీ చక్రవర్తి ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఈ అంశంపై మరింత స్పష్టత అవసరమని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+