ఉత్తర తెలంగాణ వరప్రదాయిని వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై బిగ్ న్యూస్!

ఉత్తర తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు, చుట్టూ పక్కల జిల్లాల వారికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేలా నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు.

ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలు అందించే హబ్‌గా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. నిమ్స్ తరహాలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎల్‌వోసీలు (LOCలు) మంజూరు చేస్తామని, అత్యాధునిక పరికరాలు, అవసరమైన వైద్యనిపుణులు, సిబ్బందితో పూర్తిస్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Warangal Super Specialty Hospital good news on Telangana Warangal Super Specialty Hospital

రూ.1500 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్ట్

ఉత్తర తెలంగాణా ప్రజలకు హైదరాబాద్ స్థాయి వైద్యసేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఈ ఏడాది చివరకల్లా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో 24 ఫ్లోర్లతో, రూ.1500 కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది తెలంగాణా సర్కార్. మొత్తం మూడు బ్లాకులతో కూడిన ఈ ఆసుపత్రిలో మొత్తం 34 వైద్య విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు.

రెండు వేల పడకలతో అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా ప్రణాళిక

ఉత్తర తెలంగాణా అవసరాలకు తగ్గట్టు రెండు వేల పడకలతో సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. అత్యవసర పరిస్థితుల్లో 200 మందికి పైగా రోగులకు ఒకేసారి చికిత్స అందించే సామర్థ్యం ఉంటుంది. సుమారు 500 మందికి పైగా వైద్యులు, వెయ్యికి పైగా నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా సేవలందించనున్నారు.

అన్ని వసతులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి

ప్రస్తుత వైద్య అవసరాలకు తగ్గట్టు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, సెంట్రల్ ఏసీ, ఆక్సిజన్ లైన్లు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరా, నీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. అంతేకాదు క్యాన్సర్ రోగులకు రేడియేషన్ థెరపీ అందించేందుకు కూడా ప్రత్యేక బంకర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఔట్ పేషెంట్ విభాగం, ఆడిటోరియం, ఆధునిక పరీక్షా విభాగాలతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రూపు దిద్దుకుంటుంది.

వరుస విజయాల సింగరేణి.. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయి!
వరుస విజయాల సింగరేణి.. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయి!

ఉత్తర తెలంగాణా మొత్తానికి ఇది ప్రధాన వైద్య కేంద్రం

ఈ హాస్పిటల్ పూర్తయితే వరంగల్ మాత్రమే కాదు ఉత్తర తెలంగాణా మొత్తానికి ఇది ప్రధాన వైద్య కేంద్రంగా మారనుంది. హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేకుండా వరంగల్ లోనే వేలాది కుటుంబాలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+