స్మగ్లింగ్ చేసేవాడు హీరోనా ..? అల్లు అర్జున్‌పై రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్
ఏ ముహుర్తానా అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమాను మొదలుపెట్టారో కానీ, అప్పటి నుంచి ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. 'పుష్ప-2' మొదలుపెట్టిన తర్వాత అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలంటూ ప్రచారం మొదలైంది.ఇదే సమయంలో అల్లు అర్జున్ రాజకీయ వివాదంలో కూడా ఇరుకున్నారు. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు.
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా అభిమానులు, జనసేన నాయకులు 'పుష్ప 2'కు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత అల్లు అర్జున్ వీరికి మరింత టార్గెట్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అల్లు అర్జున్‌పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో వీరి మధ్య మరింత గ్యాప్ ఏర్పడినట్టు అయింది. తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ అల్లు అర్జున్‌ను పరోక్షంగా టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు.
పరోక్షంగా పుష్ప సినిమా, అల్లు అర్జున్ మీద కామెంట్ చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్..!#RajendraPrasad #AlluArjun #Pushpa2TheRule #PushpaTheWildFire pic.twitter.com/Px71EageT3
— oneindiatelugu (@oneindiatelugu) December 9, 2024
ఓ సినిమా కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తున్నారు. నిన్న కాక మొన్న చూశాం, వాడెవడో చందనం దొంగ, వాడు హీరో. హీరోల్లో మీనింగ్ మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే, నేను 48 సంవత్సరాలుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్‌తో డిఫరెంట్ హీరో అనిపించుకున్నానని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతోనే అల్లు అర్జున్‌పై రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications