పవన్ కల్యాణ్‌పై నటుడు శివాజీ సంచలన కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో నటుల మధ్య విభేదాలున్నాయని సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నటుల మధ్య ఉన్న విభేదాలు మా ఎలెక్షన్స్ సమయంలో బయటపడుతుంటాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా మా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఇండస్ట్రీలోని నటులు రెండు వర్గాలు విడిపోయి ..రాజకీయ నాయకుల మాదిరిగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు. గతంలో మా అసోసియేషన్ అధ్యక్షుడుగా పని చేసిన నటుడు శివాజీ రాజా తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
మెగా బ్రదర్ నాగబాబుకు తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తామిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లమని తరువాత తమ మధ్య మనస్పర్థలు వచ్చి మాట్లాడుకోలేనంత దూరం పెరిగిపోయిందని ఆయన తెలిపారు. ఒకరోజు పవన్ కల్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశారని..నేను నిన్ను ప్రెసిడెంట్ కానివ్వను అంటూ నా మొఖం మీదనే పవన్ అన్నాడని శివాజీ రాజా గుర్తు చేసుకున్నారు. దీనిపై నేను ..ప్రెసిడెంట్ కాకపోతే నాకే మంచిదని..హాయిగా రెస్ట్ తీసుకుంటా అని పవన్ కల్యాణ్‌కు బదులిచ్చానని శివాజీ రాజా తెలిపారు.

వెంటనే రాఘవేంద్రరావు, సురేష్ బాబులకు ఫోన్ చేయమని పవన్ అడిగారని...అయితే వారితో నాకు అంతగా మాటల్లేవని తెలపడంతో..పవన్ తనకు అన్యాయం జరిగిందని..దీనికి ఎవరు సమాధానం చెబుతారని పవన్ నన్ను ప్రశ్నించారని శివాజీ రాజా చెప్పారు. మూవీ ఆర్టిస్‌కు మూవీ ఛాంబర్‌కు సంబంధం లేదని చెప్పడంతో పవన్ కల్యాణ్ అక్కడ నుంచి వెళ్లిపోయారని శివాజీ రాజా తెలిపారు.
శివాజీ రాజా మాటల ప్రకారం శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌పై చేసిన కామెంట్స్ తరువాత ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అర్థం అవుతుంది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ మూవీ ఛాంబర్‌కు వెళ్లి అక్కడ హడావిడి చేశారు. దీనిపై ఇండస్ట్రీ నుంచి పెద్దగా మద్దతు లభించకపోవడంతో పవన్ సైతం సైలెంట్ అయ్యారు. ఇక మా అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతిచ్చిన ప్యానెల్ ఓడిపోవడంతో ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హవా తగ్గిపోయిందనే గుసగుసలు తెర మీదకు వచ్చాయి.












Click it and Unblock the Notifications