ఒక రాజకీయ నాయకుడు కోసం ఇంతమంది ఇబ్బంది పడాలా: పవన్ హీరోయిన్ ఫైర్
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ జామ్ అనేది సర్వసాధారణం ఇక్కడ. బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాలకు వైపు వెళ్లే మార్గాల్లో ప్రైవేట్ బస్సుల వల్ల రాత్రిళ్లు కూడా హెవీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోతుంటాయి. దీనిదెబ్బకు కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ కార్యలయాలను ఇతర ప్రాంతాలు, నగర శివార్లకు రీలొకేట్ అయిన సందర్భాలు సైతం లేకపోలేదు.
ఈ పరిస్థితులపై ప్రముఖ నటి ప్రణీత సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఐపీల రాకపోకల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు మూసేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో కీలక వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. రాజకీయ నాయకుల కోసం వాహనాలను నిలిపివేయడం సరైంది కాది అన్నారు. ఇలాంటి పనులు నిరాశ వాహనదారులకు తీవ్ర ఫ్రస్ట్రేషన్ ను కలిగిస్తోన్నాయని చెప్పారు.

ఒక రాజకీయ నాయకుడి రాకపోకల కోసం సిటీ సెంటర్, కోరమంగళ వైపు రోడ్లను మూసేశారని, నిత్యం ట్రాఫిక్ స్తంభించిపోయే ఈ మార్గంలో వీఐపీ మూమెంట్ కోసం వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రజలకు చాలా సమస్యలు వస్తున్నాయని ప్రణీత సుభాష్ అన్నారు. అందుకే దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని తేల్చి చెప్పారు. రాజకీయ నాయకులు, వారి వీఐపీ జీవితాలు దేశ ప్రగతికి మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా సమస్యలనే సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ సంస్కృతి పురోగతి కంటే సమస్యలనే అధికం చేస్తుందని ప్రణీత విమర్శించారు.
This is frustrating ! Roads enroute city centre and Koramangala blocked causing a lot of issues for all the civilians just for some
— Pranitha Subhash (@pranitasubhash) January 13, 2026
VIP movement of some politician! This is exactly why India will never get anywhere . Politicians and their VIP lives are only there cause more…
ఆమె ట్వీట్ అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంది. పొలిటికల్ కాన్వాయ్‌లు, భద్రతా చర్యల వల్ల తాము ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. బెంగళూరులో వీఐపీల వల్ల ట్రాఫిక్ రద్దీ నిరంతర సమస్య, రోడ్లు మూసివేయడంతో వాహనదారులకు తరచూ జాప్యం చోటు చేసుకుంటుంటుంది. ఈ అంతరాయాలపై నివాసితులు పదేపదే విమర్శలు వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications