త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !!
"ఈషా రెబ్బ" .. తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అందం మాత్రమే కాకుండా సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. చిన్న సినిమాల నుంచే తన ప్రయాణాన్ని మొదలుపెట్టి క్రమంగా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా గుర్తింపు పొందిన ఈ భామ.. ఆ తర్వాత అమీ తుమీ, విస్మయం, బ్రాండ్ బాబు వంటి విభిన్న కథాంశాలున్న సినిమాల్లో మెప్పించింది.
అంతే కాకుండా పెద్ద హీరోల సినిమాల్లోనూ ఈషాకు అవకాశాలు దక్కాయి. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో పూజా హెగ్డే సరసన సెకండ్ హీరోయిన్‌గా కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అలానే థియేటర్ సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈషా రెబ్బ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెబ్ సిరీస్‌ల ద్వారా కొత్త తరహా ప్రేక్షకులకు చేరువైంది. డిజిటల్ మీడియాలో ఆమె చేసిన పాత్రలు ప్రశంసలు అందుకున్నప్పటికీ.. ఆమెకు సరైన బ్రేక్ దక్కడం లేదు. రీసెంట్ గానే 3 రోసెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌లో ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తూ తనదైన శైలిలో రాణిస్తుంది.

ఇక ఈ ఏడాది ఈ యంగ్ బ్యూటీ నటించిన చిత్రం "ఓం శాంతి శాంతి". తరుణ్ భాస్కర్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అయితే ఈమె దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో రిలేషన్‌లో ఉందంటూ గత కొంత కాలంగా వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా విశాఖపట్నంలో ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది.
కలర్స్ 2.0 ఓపెన్..
కాగా ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉందని, అందుకోసం యువత ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హీరోయిన్ ఈషా రెబ్బ అన్నారు. ప్రముఖ వెల్నెస్, హెల్త్‌కేర్ సంస్థ కలర్స్ ఏర్పాటుచేసిన నూతన బ్రాంచ్ 'కలర్స్ 2.0'ను గాజువాకలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతంలో తాను రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం అందం సిద్ధిస్తుందన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం, అందంపై శ్రద్ధ అత్యంత అవసరమని పేర్కొన్నారు. బరువు తగ్గడం, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. కలర్స్ సంస్థ సేవలు ఇప్పటికే అనేక మందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు. 5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక యువత పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications