ఆ తెలుగు సినిమా అంటే అసహ్యం.. రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్!

ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ తెలుగు సినిమాలో నటించినప్పుడు ఎదురైన పరిస్థితులు తనకు ఎంతమాత్రం నచ్చలేదని.. ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తాను అసహ్యించుకున్నానని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

అన్న సినిమాకు మామూలు దెబ్బ కాదిది..!!
అన్న సినిమాకు మామూలు దెబ్బ కాదిది..!!

వివాదానికి దారితీసిన కామెంట్స్
ఇటీవల నటి కీర్తి సురేష్‌తో కలిసి నటించిన ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే మాట్లాడారు. "నేను ఓ తెలుగు సినిమా చేశాను. అందులో నా బావను పెళ్లిచేసుకునే పాత్రలో నటించాల్సి వచ్చింది. నా కెరీర్లోనే అది అత్యంత కష్టమైన పాత్ర. ఆ వాతావరణం, అక్కడి ఆలోచనా విధానం పూర్తిగా పితృస్వామ్య యుతంగా అనిపించాయి. నిజం చెప్పాలంటే ఆ సినిమాలోని ప్రతీ విషయాన్ని నేను తీవ్రంగా అసహ్యించుకున్నాను" అని రాధికా ఆప్టే స్పష్టం చేశారు.

Actress Radhika Apte Sensational Comments On Telugu Movie Legend And Nandamuri Balakrishna

అంతే కాకుండా తన కంటే వయసులో చాలా పెద్దవారైన హీరోతో రొమాన్స్ చేయాల్సి రావడం పెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. "సినిమా మధ్యలోనే ఆ పాత్ర చనిపోతుంది. నన్ను భుజంపై వేసుకుని విసిరేసి ఆ తర్వాత యాక్షన్ సీన్ చేయాలి. ఈ పాత్ర ఎప్పుడు ముగుస్తుందా అని నేను ఎదురుచూశాను" అని నటి రాధికా ఆప్టే వివరించారు. రాధికా మాటలు విని పక్కనే ఉన్న కీర్తి సురేష్ తొలుత ఆశ్చర్యపోయినప్పటికీ.. తెలుగు, తమిళ సాంప్రదాయాలలో మేనరిక వివాహాలు సాధారణమేనని వివరించే ప్రయత్నం చేశారు.

దియా మీర్జా దీపావళి వీడియో వివాదం.. సెలబ్రిటీ గొంతు నొక్కుతున్నారా?
దియా మీర్జా దీపావళి వీడియో వివాదం.. సెలబ్రిటీ గొంతు నొక్కుతున్నారా?

ఆ సినిమా ఏమిటంటే?
ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే ఏ సినిమా పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఆమె చెప్పిన సీన్ల ఆధారంగా అది బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014లో వచ్చిన లెజెండ్ సినిమానేనని నెటిజన్లు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదలైన సమయంలో బాలకృష్ణ వయసు 54 సంవత్సరాలు కాగా.. రాధికా ఆప్టే వయసు 29 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు 25 ఏళ్ల వయసు తేడా ఉంది. ప్రస్తుతం రాధికా ఆప్టే చేసిన ఈ కామెంట్స్ టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+