కాబోయే భర్తలో ఆ ఒక్క లక్షణం ఉండాల్సిందే.. సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తన నేచురల్ యాక్టింగ్ స్కిల్స్‌తో, సింపుల్ లైఫ్‌స్టైల్‌తో లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తన పర్సనల్ లైఫ్, కాబోయే జీవిత భాగస్వామికి ఉండాల్సిన అర్హతల గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చకు దారితీశాయి. కాబోయే భర్తకు అంద చందాల కంటే కూడా మనస్తత్వం, పరిణతి అత్యంత కీలకమని సాయిపల్లవి స్పష్టం చేశారు.
ఆ గుణమే అత్యంత కీలకం
తన జీవిత భాగస్వామిలో ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం గురించి సాయిపల్లవి మాట్లాడుతూ.. తన తప్పును తాను తెలుసుకుని, దానిని బహిరంగంగా అంగీకరించే సత్తా ఉన్న పురుషుడిని నేను కోరుకుంటున్నాని ఆమె పేర్కొన్నారు. జీవితంలో పొరపాట్లు చేయడం సహజమని, అయితే చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే గుణం భాగస్వామికి ఉండాలని సాయిపల్లవి స్పష్టం చేశారు.

ప్రస్తుత సమాజంలో అనేక సంబంధాలు విడిపోవడానికి భాగస్వాముల్లో ఉండే అహమే ప్రధాన కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు కాబోయే భర్త తన అహంలో మునిగి తేలుతూ.. తాను చేసిందే సరైనది అని సమర్థించుకునే వ్యక్తి అయి ఉండకూడదని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులపై నిందలు వేయకుండా.. తన ప్రవర్తనను తాను సమీక్షించుకునే పరిణతి అతనిలో ఉండాలన్నారు.
అసలు తప్పుల చేయని మనుషులు ఎవరూ ఉండరని.. అయితే చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ఎదిగే వ్యక్తిత్వమే కీలకమని సాయిపల్లవి అభిప్రాయపడ్డారు. బాహ్య సౌందర్యం, హోదా కంటే అంతర్గత ప్రశాంతత, బాధ్యతా రాహిత్యాన్ని వీడడం లాంటి లక్షణాలే వైవాహిక జీవితాన్ని సుఖమయం చేస్తాయని సాయిపల్లవి నమ్ముతున్నారు. వినడానికి ఇది సాధారణ కోరికగా అనిపించినప్పటికీ.. నిజ జీవితంలో తప్పులను అంగీకరించే మనస్తత్వం ఉన్న భాగస్వామిని పొందడం అంత సులువు కాదని సాయిపల్లవి కామెంట్స్ నిరూపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
