ఇషాన్ వస్తే వైభవ్ ఎగ్జిట్? టీమిండియాలో ఇదేం లెక్క సామీ!

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా విధ్వంసం సృష్టించినప్పటికీ.. తదుపరి మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే మారింది. ఇషాన్ కిషన్ మళ్లీ జట్టులోకి తిరిగొస్తే.. సంజు శాంసన్‌ను తిరిగి ఓపెనర్‌గా పంపి వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాలని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక సూచన చేశారు. 15 ఏళ్ల బేబీబాస్ వైభవ్ సూర్యవంశీపై అతిగా అంచనాల భారం మోపవద్దని.. అతనికి స్వేచ్ఛగా ఎదిగే సమయాన్ని ఇవ్వాలని అభిమానులకు, క్రికెట్ నిపుణులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

IND vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ బౌలర్ దూరం!
IND vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ బౌలర్ దూరం!

ఇషాన్ స్థానంలో వైభవ్ మెరుపులు
ఇషాన్ కిషన్ గాయపడటంతో రెండో, మూడో టీ20ల్లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం లభించింది. వెల్లింగ్‌టన్‌లో జరిగిన మూడో టీ20లో సంజు శాంసన్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన మూడో స్థానానికి వెళ్లగా.. వైభవ్-అభిషేక్ శర్మల జోడీ విధ్వంసం సృష్టించింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించగా.. ఈ జోడీ తొలి వికెట్‌కు ఏకంగా 133 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించి సంచలన విజయం సాధించింది.

IND vs NZ Vaibhav Sooryavanshi Out If Ishan Kishan Returns Ravichandran Ashwin Shares View

ఈ పరిణామాలపై రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. "వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అంతటా ఎలాగైతే నిర్భయంగా ఆడాడో, ఇక్కడ కూడా అదే ఆటతీరును ప్రదర్శించాడు. వైభవ్ ఓ ప్రత్యేకమైన ప్లేయర్. అయితే అక్టోబర్ 30న ఆక్లాండ్‌లో జరిగే నాలుగో టీ20కి ఇషాన్ కిషన్ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగొస్తే సంజు శాంసన్ మళ్లీ ఓపెనర్‌గా రావడమే సరైన నిర్ణయం. అప్పుడు వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టక తప్పదు. సంజు శాంసన్‌కు మూడో స్థానంలో ఆడే అనుభవం ఉన్నప్పటికీ.. అతనికి ఓపెనింగ్ స్థానమే అనుకూలమైనది"అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు.

జింబాబ్వేను చిత్తు చేసిన భారత్.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ!
జింబాబ్వేను చిత్తు చేసిన భారత్.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ!

బేబీ బాస్‌పై ఒత్తిడి వద్దు
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్లో గొప్ప పోస్టర్ బాయ్‌గా మారే సత్తా ఉందని అశ్విన్ ప్రశంసించారు. "ఇంత చిన్న వయసులోనే అతడిపై పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఒత్తిడి పెంచడం సరికాదు. నేను 16 ఏళ్ల వయసులో చెన్నై స్టేడియాల్లో ఏ ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించాను. వైభవ్ సూర్యవంశీకి కూడా అలాంటి ప్రశాంతమైన వాతావరణమే కావాలి. వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తు అనడంలో సందేహం లేదు. కానీ ప్రస్తుతానికి వైభవ్ తన ఆటను స్వేచ్ఛగా ఆస్వాదించనివ్వాలి" అని అశ్విన్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+