బాలయ్య కోసం హిమాలయాల్లో బోయపాటి రెక్కీ

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా మూవీ.. అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకుడు. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ ఇది. అఘోరీగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారీ మూవీలో. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిందీ సినిమా.

ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కించబోతోన్నారు బోయపాటి. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. కిందటి నెలలో మహా కుంభమేళాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అసలైన అఘోరీలు, వారి జీవన విధానం, త్రివేణి సంగమం, కుంభమేళకు సంబంధించిన సీన్లను షూట్ చేశారు. అఘోరీలతో కూడిన సినిమా కావడం వల్ల ఆయా సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది.

Akhanda 2 Director Boyapati Srinu visits Himalayas

ఇప్పుడు తాజాగా బోయపాటి హిమాలయాల్లో మకాం వేశారు. అక్కడ రెక్కీ నిర్వహించారు. కథకు అనుగుణంగా అత్యంత కీలక ప్రదేశాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. అసేతు హిమాలయ పర్వతాలను సరికొత్త కోణంలో షూట్ చేయాలని బోయపాటి భావిస్తోన్నారు. అందుకే- ఇప్పటి వరకూ ఎవరూ చిత్రీకరించడానికి సాహసించని ప్రదేశాలను అఖండ 2 సినిమా కోసం అన్వేషిస్తోన్నారు.

లొకేషన్ల ఎంపికపై దాదాపుగా కసరత్తు పూర్తయినట్టే. అఘోరీ బాలకృష్ణ ఇంట్రడక్షన్ సహా కొన్ని సీన్ల చిత్రీకరణ ఆయా ప్రాంతాల్లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు. లొకేషన్లుపై ఒకసారి ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంటే ఇక అఖండ 2 యూనిట్ మొత్తం కూడా హిమాచల్ ప్రదేశ్‌కు షిఫ్ట్ అవుతుంది.

ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్, శరత్ లోహితాశ్వ.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. సరైనోడు తరువాత బోయపాటి శ్రీనుతో మూవీ చేస్తోన్నారు ఆది పినిశెట్టి. ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నాడు. 14 రీల్స్ ప్లస్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+