అల్లు అరవింద్‌కు పవన్ కల్యాణ్ గుర్తొచ్చాడే?
గీత ఆర్ట్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ కు ఒక్కసారిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుర్తుకొచ్చారు. హోంబలే ఫిలింస్ తీసిన పాన్ ఇండియా చిత్రం మహావతార్ నరసింహను తెలుగులో అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధిస్తోంది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైనరోజే ఇది కూడా విడుదలైంది. తర్వాత మౌత్ టాక్ తో ఇప్పటివరకు రూ.70 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు.. కొత్త రికార్డులు నెలకొల్పే దిశగా పయిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుకను తాజాగా నిర్వహించారు.
సనాతన ధర్మం గురించి పవన్ కు బాగా తెలుసు
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ తనకు తెలిసినవారిలో, తన స్నేహితుల్లో, తన సన్నిహితుల్లో, తన బంధువుల్లో, తమ కుటుంబాల్లో సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ముగ్ధులమైపోతామని, ఆయన మహావతార్ నరసింహ సినిమా చూసి దీన్నిగురించి మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, దాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా చూసి దీనిపై కూడా మాట్లాడాలని అల్లు అరవింద్ కోరుకుంటున్నారు.

పవన్ మాట్లాడితే లాభడేది అల్లు అరవిందే
ఆయన కోరుకుంటున్నట్లుగా పవన్ కల్యాణ్ మహావతార్ నరసింహ సినిమా గురించి మాట్లాడితే ఈ సినిమాకు ఎక్కువగా ప్రచారం లభిస్తుంది. కలెక్షన్లు పెరుగుతాయి. దీనివల్ల లాభపడేది అల్లు అరవిందే. వాస్తవానికి ఈ సినిమాపై తెలుగులో పెద్దగా ప్రచారం చేయలేదు. హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయానికి థియేటర్ల బంద్ ప్రకటించి ఆ నలుగురిలో అల్లు అరవింద్ కూడా ఒకరు.
కానీ ఆ విషయాన్ని చాలా సింపుల్ గా మర్చిపోయినట్లు కనపడుతున్నారంటూ పవన్ అభిమానులు మండిపడుతున్నారు. తమ హీరో ఈ సినిమా గురించి ఎటువంటి పరిస్థితుల్లోను మాట్లాడరని, ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నారని, తెరవెనక చేయాల్సినవన్నీ చేస్తూనే తెరముందు పొగడటం మీకే చెల్లిందంటూ నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications