కోల్డ్‌వార్: నాగచైతన్యను టార్గెట్ చేసిన అల్లు అరవింద్?
మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనే విషయం తెలిసిందే. గతంలో చిన్న చిన్నవిగా మొదలైన విభేదాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి తీవ్రస్థాయికి చేరాయి. పవన్ కల్యాణ్ కు కేవలం ట్వీట్ ద్వారా గెలవాలని కోరుకుంటున్నానంటూ తెలిపిన బన్నీ తన స్నేహితుడు, నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కిషోర్ చంద్రరెడ్డికి మద్దతుగా వెళ్లి ప్రచారం చేశారు. అప్పటి నుంచి మెగా, అల్లు కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బన్నీ హోస్ట్ గా వచ్చారు. ఇందులో కూడా బాలయ్య దీనికి సంబంధించిన అన్ని విషయాలను అడిగినట్లు సమాచారం. ఈ ప్రోమో విడుదల కావాల్సి ఉంది.
భారీ డిజాస్టర్ గా నిలిచింది
ఇప్పుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ నాగచైతన్యతో నిర్మిస్తున్న తన సినిమా తండేల్ ను బరిలోకి దింపారు. గేమ్ ఛేంజర్ పై ఇప్పటికే ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి లేదు. దీనికి తోడు శంకర్ ఇండియన్ 2 భారీ డిజాస్టర్ గా నిలిచింది. గత ఐదు సంవత్సరాల్లో అత్యంత ఫ్లాప్ సినిమాగా నిలిచింది. దీంతో ఈ సినిమాపై ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. సంక్రాంతికి విడుదల చేయడంవల్ల సెలవులన్నా కలిసివచ్చి ఒడ్డున పడతామని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం దీన్ని కొనడానికి కూడా బయ్యర్లు ముందుకు రావడంలేదు.

భయపడుతున్న మెగా అభిమానులు
ఇటువంటి తరుణంలో భారీ అంచనాలున్న పాన్ ఇండియా సినిమా తండేల్ వస్తుండటంతో నిర్మాతకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు మంచిగానే ఉన్నాయి. చందు మొండేటి దర్శకుడు కాగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడి నిజ జీవిత కథ ఆధారంగా దీన్ని నిర్మించారు. పోస్టర్లు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఇటువంటి తరుణంలో గేమ్ ఛేంజర్ ఏమాత్రం బాగోలేదు అనే టాక్ వచ్చి, తండేల్ బాగుందనే టాక్ వచ్చినా చాలు రామ్ చరణ్ సినిమా ఫ్లాపయ్యే అవకాశం ఉంది. తండేల్ హిట్ అవుతుంది. మెగా అభిమానులు ఈ విషయంలోనే భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications