మెగా ఫ్యామిలీకి చోటు లేదు బ్రదర్..!
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా వచ్చే గురువారం(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినీ యావత్తు మొత్తం కూడా పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తున్నారు. ప్యాన్ ఇండియా లేవల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పుష్ప-2కు పబ్లిసిటీ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.
ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీకి చెందిన కౌటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ సినిమా థియేటర్ వద్ద ఫ్యాన్స్.. అల్లు కుంటుంబం మొత్తాన్ని కటౌట్‌తో ఏర్పాటు చేశారు. ఇందులో అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ , అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్. చివరకు అల్లు అయాన్ కూడా ఉండటం విశేషం. థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కటౌట్ నెట్టింట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఫ్లెక్సీలో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలకు చోటు ఇవ్వలేదు.

మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.
ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పుష్ప-2 ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్ ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. గతంలో పలుమార్లు మెగా అభిమానులు అంటూ మాట్లాడిన అల్లు అర్జున్ , ఇప్పుడు మాత్రం మై ఫ్యాన్స్, మై ఆర్మీ అని మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు. దీని కారణంగానే అల్లు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మెగా హీరోలకు చోటివ్వలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications