40 ఏళ్ళు వచ్చినా పర్లేదు,మరోసారి తల్లిని అవుతా - అనసూయ సంచలనం
అందాన్ని అనసూయను వేరుగా చూడటం కొంచెం కష్టమే. ఎందుకంటే అందానికి మారు పేరే అనసూయ. ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది.
క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన , స్కార్ట్ వేసిన ఏం చేసిన అది అనసూయకే చెల్లింది.
ఆ మధ్య పిల్లల గురించి అనసూయ కీలక వ్యాఖ్యలు చేసింది. అనసూయకు ఇద్దరూ మగపిల్లలే. అనసూయ తండ్రికి ముగ్గురూ ఆడపిల్లలే. దాంతో ఫస్ట్ అబ్బాయి పుట్టాలని గట్టిగా కోరుకుందట. ఆమె కోరుకున్నట్టుగానే అనసూయకు మొదట అబ్బాయి పుట్టాడు. దీంతో రెండో సంతానం అమ్మాయి కావాలని అనుకుందట. కానీ మళ్ళీ అబ్బాయి పుట్టడంతో ఒకింత నిరాశ చెందిందట.అయితే కూతురు కోసం మరోసారి తల్లి కావడానికి సిద్ధం అంటుంది అనసూయ. 40 ఏళ్ళు వచ్చినా పర్లేదు. అమ్మాయిని కనేందుకు ఇప్పటికి కూడా తల్లిని కావాలని ఉందని అనసూయ చెప్పుకొచ్చింది. ఆడపిల్ల కోసం వేచి చూస్తానని చెప్పిన అనసూయ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications