అవమానాలకు అలవాటు పడ్డ మెగా ఫ్యామిలీ

టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం జగన్‌ను సైకో అని సంబోధించడంతో పాటు, మెగాస్టార్ చిరంజీవిపై సైతం ఆయన అసందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే బాలకృష్ణ ఇలా మెగా కుటుంబంపై విమర్శలు చేయడం ఇదేం మొదటిసారి, చివరిసారి కాదు. గతంలో పలుమార్లు ఆయన చిరంజీవి కుటుంబంపై విమర్శలు చేశారు.

ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు కలిసి పని చేస్తున్నాయి కానీ, గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం అధిపత్య పోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి. ముఖ్యంగా నందమూరి నట సింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కస్సును వెళ్లగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

Balakrishna criticized Chiranjeevi in Assembly Reopened old rivalry

రాజకీయాలు అంటే ఎమోషన్ కాదు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు. గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్‌కి వెళ్ళాడు. అక్కడ ఆటో గ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాల్లో అందరూ రాణించలేరు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు...అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగ బాబు గట్టిగానే కౌంటరిచ్చారు.

బ్లడ్, బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్, చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశాడు. ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ సెటైర్లు వేశారు. జనసేన సభలకు వెళ్లే వారు అలగాజనం అంటూ బాలకృష్ణ హేళనగా మాట్లాడారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. 2024 ఎన్నికల్లో మెగా , నందమూరి ఫ్యామిలీలు కలిసి పని చేశాయి. పవన్ కల్యాణ్ సాయంతో కూటమి అధికారంలోకి వచ్చింది.అంతా సవ్యంగా జరుగుతుందనే సమయంలో బాలయ్య చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై పవన్ కల్యాణ్, నాగ బాబు సైలెంట్‌గా ఉండటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, బాలకృష్ణ నుంచి పెద్దగా స్పందన లేదు, ఆయన క్షమాపణలు చెప్పే అవకాశం కూడా కనిపించడం లేదు. మొదటి నుంచి కూడా బాలకృష్ణ చేతిలో మెగా ఫ్యామిలీ అవమానాలకు అలవాటు పడిందని కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+