జూనియర్ ఎన్టీఆర్ బిగ్ అనౌన్స్‌మెంట్..? ముహూర్తం ఫిక్స్..!!

జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు. తారక్ ఫ్యాన్స్ తో పాటుగా సినీ - పొలిటికల్ సర్కిల్స్ లో జూ ఎన్టీఆర్ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. తమిళనాడు లో విజయ్ సీఎం అవ్వటం వెనుక చేసిన ప్రయత్నాలు..ప్రణాళికా బద్దంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ కీలక ప్రకటన చేయనున్నారని.. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీని పైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ అడుగులు ఎటు. కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పైన కొత్త ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18న తారక్ కీలక ప్రకటన చేయనున్నారనేది ఆ ప్రచార సారాంశం. తన అభిమాన సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించే ఆలోచనలో తారక్ ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం జోరుగా సాగుతున్నా.. ఇప్పటి వరకు ఈ ప్రచారంపై జూనియర్ ఎన్టీఆర్ క్యాంపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎంట్రీ ఇస్తారని కొంత కాలంగా ప్రచారంలో ఉంది.

ఎన్టీఆర్ #GODOFWAR కి పోటీగా ధనుష్
ఎన్టీఆర్ #GODOFWAR కి పోటీగా ధనుష్
Jr NTR likely to made Big Announcement on July 18 Speculation Grips Film and Political Circles

అయితే, ఆయన ఆ వార్తలను ఖండించారు. తాను పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేసానని పదే పదే స్పష్టం చేసారు. 2009 లో నాడు మహాకూటమి తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసారు. తన ప్రసంగాలతో యువతను ఆకట్టుకున్నారు. ప్రచారం సమయంలోనే జరిగిన ప్రమాదంలో గాయపడిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన పూర్తి దృష్టిని సినిమాలపై కేంద్రీకరించారు.

పాన్ ఇండియా హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం హైదరాబాద్ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ సమయంలోనూ తారక్ రాజకీయ ప్రవేశం గురించి చర్చ జరిగింది. అయితే, ఆ తరువాతగా తారక్ పూర్తిగా సినిమాలకు పరిమితం అయ్యారు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా.. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా సమన్వయంతో సేవా కార్యక్రమాలు నిర్వహించే దిశగా ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశముందని ప్రచారం సాగుతోంది.

ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ లానే.. అఖిల్‌కి కలిసొచ్చిన ఆ సెంటిమెంట్ !!
ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ లానే.. అఖిల్‌కి కలిసొచ్చిన ఆ సెంటిమెంట్ !!

ముందుగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వచ్చి.. ఆ తరువాత రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు ముందు గా ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది మరో చర్చ. ఈ చర్చల నడుమ జూనియర్ ఎన్టీఆర్ శిబిరం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రావటం లేదు. దీంతో.. అసలు ఈ ప్రచారంలో నిజం ఎంత.. తారక్ నిర్ణయం ఏంటనేది తేలాంటే 18వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+