వియత్నాం పడవలో ఉన్న భారతీయ పర్యాటకులు వీళ్లే- ఎంబసీ నుంచి..!!
వియత్నాంలో ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులకు స్వర్గధామం ఫు కువక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో దాదాపు 32 మంది పర్యాటకులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వారందరూ గల్లంతయ్యారు. వారిలో 18 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదాన్ని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఎక్స్ ఓ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పర్యాటకుల ఆచూకీ కనుగొనడానికి స్థానిక వియత్నాం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రయాణికుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.

ప్రమాదానికి గురైన వారి వివరాలు, అత్యవసర సహాయం కోసం బాధితుల కుటుంబ సభ్యులు హో చి మిన్ సిటీ కంట్రోల్ రూమ్ +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414, హనోయ్ కంట్రోల్ రూమ్ +84 91 308 9165 ద్వారా తమను సంప్రదించాలని సూచించారు. పడవ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాతావరణంలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న మార్పులా లేక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తోన్నారు.
ప్రమాద సమయంలో పడవలో ఉన్న 32 మంది పర్యాటకుల పేర్లను రాయబార కార్యాలయం విడుదల చేసింది. వీరందరూ భారతీయులే. 1. బాలసుబ్రమణి పళణిస్వామి, 2. సెల్వం పిచ్చయ్య, 3. సెంథిల్ కుమార్ జయవేళ్, 4. శివకుమార్ ముత్తు కుమారస్వామి, 5. నిర్మల్ కుమార్ సేతురామన్, 6. మురుగ ప్రభు ఆర్ముగం, 7. రుబాన్ సెల్వ నాథన్ జాకబ్ ఏసుపాదం, 8. శ్రీధర్ ధర్మరాజు, 9. విఘ్నేశ్వర్ రాధాకృష్ణన్ గోపాల్, 10. రామసుబ్బు అన్నావి ఉన్నారు.
వీరితో పాటు.. 11. అబుతల్కా జహీరుద్దీన్, 12. శ్రీధర్ సుందరరాజన్, 13. వంశీధర్ సెల్లూర్ రామ్ రాజ్, 14. సెంజాదైవేళ్ కుప్పు స్వామి, 15. నాగలమడుగు సోహాన్, 16. నల్లపేట ఆదిశేషయ్య రవితేజ, 17, షేక్ అబ్దుల్లా అబ్దుల్ మాజీద్, 18. రాజీవ్ కళైవావన్, 19. బాలాజీ నటేషన్, 20. వినయ్ కుమార్ చిత్తాపురం భాస్కర, 21. రవిశంకర్ సుకుమారన్, 22. విపుల్ ఉత్తమ్ చంద్, 23. సంతోష్ కుమార్ శాంతిలాల్ జైన్, 24. బాబు కుప్పుస్వామి, 25. అలగురాజన్ శివస్వామి, 26. వసంత కుమార్ ఆనందన్, 27. శ్రీధర్ ముడియం, 28 జయలక్ష్మి గెల్లి, 29. కిశోర్ గెల్లి, 30 అవికాట్ చెరియన్ థామస్, 31. లొవెణి, 32. రమేష్ కుమార్ పచ్చియప్పన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications