శ్రావణ మాసంలో ఈ 4 రాశుల వారికి అపార ధన ప్రాప్తి!
నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహాలుగా భావించే రాహువు, కుజుల కలయిక ద్వారా జ్యోతిష్య శాస్త్రంలో ఓ అరుదైన నక్షత్ర మార్పు చోటుచేసుకోబోతోంది. పవిత్రమైన శ్రావణ మాసంలో రాహు గ్రహం తన సంచారాన్ని మార్చుకోవడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 2వ తేదీన రాహువు శతభిషా నక్షత్రం నుంచి బయటకు వచ్చి, కుజ గ్రహ ఆధిపత్యం కలిగిన 'ధనిష్ఠ నక్షత్రం' లోకి అడుగుపెట్టబోతున్నాడు.
సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యం, పరాక్రమం, భూమి, స్థిరాస్తులకు కారకుడిగా పరిగణిస్తారు. అటువంటి గ్రహానికి సంబంధించిన నక్షత్రంలోకి గ్రహఛార రీత్యా అత్యంత ప్రభావవంతమైన రాహువు ప్రవేశించడం వల్ల విశ్వంలోనూ, వ్యక్తిగత జాతకాల్లోనూ విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఈ నక్షత్ర మార్పు నాలుగు రాశుల వారికి రాజయోగ సమానమైన ఫలితాలను, ఊహించని ధన లాభాలను అందించబోతోంది. ఆ రాశులేవో, వారికి కలగబోయే శుభఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి
మిథున రాశి వారికి ఈ నక్షత్ర మార్పు ప్రతి రంగంలోనూ అద్భుతమైన పురోగతిని అందిస్తుంది. షేర్ మార్కెట్, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్లు చేసిన వారికి భారీగా లాభాలు దక్కుతాయి. సొంత ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలనుకునే వారి కల ఈ కాలంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
కుంభ రాశి
ధనిష్ఠ నక్షత్రానికి కుంభ రాశితో అత్యంత సామీప్య సంబంధం ఉండటం వల్ల, రాహువు సంచారం వీరికి గోచార రీత్యా విశేష లబ్ధిని చేకూరుస్తుంది. రావలసిన పాత బాకీలు, రావు అనుకున్న మొండి బకాయిలు అనుకోకుండా చేతికి అందుతాయి. రీసెర్చ్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి తమ నైపుణ్యాలకు తగిన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది, అనుకోని శుభవార్తలు వింటారు.
మేష రాశి
ధనిష్ఠ నక్షత్రాధిపతి అయిన కుజుడు స్వయంగా మేష రాశికి అధిపతి కావడం వల్ల, ఈ నక్షత్ర మార్పు వీరికి అత్యంత అదృష్టదాయకంగా మారనుంది. ఊహించని మార్గాల ద్వారా అనుకోని రీతిలో ధనం వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు, లీగల్ చిక్కులు ఈ సమయంలో వేగంగా పూర్తవుతాయి.
తులా రాశి
ఆగస్టు 2న జరిగే ఈ సంచారం తులా రాశి వారి జీవితాల్లో కొత్త కాంతులు నింపబోతోంది. గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక, ఆర్థిక ప్రతిబంధకాలు తొలిగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతులు (ప్రమోషన్లు), జీతాల పెంపు వంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంత వాహనం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే యోగం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతాయి.














Click it and Unblock the Notifications