విద్యార్థులకు శుభవార్త... ఆ స్కూల్స్ లో ఏఐ హబ్స్!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలలో కృత్రిమ మేధ కోడింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఏఐ అవసరం ఎంతో ఉందని, ఏఐ జ్ఞానం లేకుండా మనుగడ సాగించడం చాలా కష్టమని గుర్తించి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

794 ప్రభుత్వ పాఠశాలలు పిఎం శ్రీ పాఠశాలలుగా గుర్తింపు

ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలలో ఈ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 794 ప్రభుత్వ పాఠశాలలు పిఎం శ్రీ పాఠశాలలుగా గుర్తించబడ్డాయి. వీటిలో జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న 33 స్కూల్స్ ను ఏపీ హబ్ స్కూల్స్ గా అభివృద్ధి చేసి వీరికి సాంకేతిక విద్య బోధన చేస్తారు.

AI Coding Labs Telangana govt AI Coding Labs in PM SHRI schools with Rs 40 crore for children technical needs

ఏఐ ల్యాబ్ ల ఏర్పాటుకు 40కోట్ల రూపాయలు

అంటే ప్రతి జిల్లాకు ఒక స్కూల్ చొప్పున ఎంపిక చేసి ఏఐ ల్యాబ్ ల ద్వారా బోధన చేయనున్నారు. ఈ ల్యాబ్ ల ఏర్పాటుకు 40కోట్ల రూపాయలను కేటాయించారు. ఇప్పటికే టెండర్లు ఆహ్వానించినందున 2026- 27 విద్యా సంవత్సరం నుండి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఏఐ కోడింగ్ ల్యాబ్లో కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్స్ పరికరాలు, ఏఐ టూల్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ఉంటాయి.

విద్యార్థులు ప్రాక్టికల్ గా నేర్చుకునే అవకాశం

వీటితో విద్యార్థులు ప్రాక్టికల్ గా నేర్చుకునే అవకాశం ఉంది. గత విద్యా సంవత్సరం 2025-26 నుండి 1నుండి 5తరగతుల బుక్స్ లో ఏఐ పాఠాలు చేర్చారు. ఈ సంవత్సరం నుండి 10వ తరగతికి కూడా ఏఐ పాఠ్య పుస్తకం తీసుకు రాబోతున్నారు. పూణేకు చెందిన ఫై జామ్ ఫౌండేషన్ సహకారంతో SCERT బృందం ఈ పుస్తకాన్ని రూపొందించింది. కేంద్రం ప్రత్యేకనిధులు అందించే పీఎం శ్రీ స్కూల్స్ లో వీటిని అందుబాటులోకి తెస్తున్నారు.

తెలంగాణాలో వారికి కోటి రూపాయల ప్రమాద బీమా పథకం!
తెలంగాణాలో వారికి కోటి రూపాయల ప్రమాద బీమా పథకం!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ నిర్ణయం

ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని తెలంగాణా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి నుండే పిల్లలకు ఏఐ కోడింగ్, రోబోటిక్స్ నేర్చుకోవటం వలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థుల మధ్య అంతరం తగ్గుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+