తెలంగాణాలో వారికి కోటి రూపాయల ప్రమాద బీమా పథకం!

తెలంగాణా రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరగాలి అంటే అందులో విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాత్ర ఎంతో ఉంటుంది.ముఖ్యంగా వర్షాకాలంలో అయితే వారు ప్రాణాలకు తెగించి మన విద్యుత్ అవసరాలను తీర్చటానికి కష్టపడతారు. ఒక్కోసారి ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్న ఉద్యోగులు కూడా ఉన్నారు.

విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం భారీ ప్రమాద బీమా

అలాంటి విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం తెలంగాణా ప్రభుత్వం భారీ ప్రమాద బీమా పథకాన్ని అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ సిబ్బందికి ఒక కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద మొత్తంలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకం లేదు. తెలంగాణా ప్రభుత్వం, తెలంగాణా డిప్యూటీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకం విద్యుత్ సిబ్బంది కోసం అందుబాటులోకి తెచ్చారు.

Telangana Electricity Staff Insurance Telangana government introduces Rs 1 crore accident insurance

బీమా పథకం సింగరేణి కాలరీస్ లో ప్రవేశపెట్టి, తర్వాత విద్యుత్ శాఖకు

విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగుల భద్రత మరియు సంక్షేమం ధ్యేయంగా ఈ ప్రమాద బీమా పథకాన్ని అందిస్తున్నారు. మొదట ఈ బీమా పథకం సింగరేణి కాలరీస్ లో ప్రవేశపెట్టి, తర్వాత విద్యుత్ శాఖ సిబ్బందికి విస్తరించారు. విద్యుత్ రంగంలో పని చేసే ఉద్యోగులు ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్న క్రమంలో ఈ పథకం వారికి ఆర్ధిక భద్రత అందిస్తుంది.

ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతే తీవ్ర సంక్షోభంలో ఉద్యోగుల కుటుంబాలు

విద్యుత్ శాఖ కార్మికులు, సిబ్బంది విద్యుత్ స్తంభాలపై ఎక్కి పనిచేసే క్రమంలో వారు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతే ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకుని ప్రకటించారు. అంతే కాదు విద్యుత్ శాఖ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, కొత్త హెల్త్ స్కీమ్ వంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నాయి.

తెలంగాణాకు కేంద్రం భారీ వరం.. పారిశ్రామిక అభివృద్ధికి భవ్య పథకం!
తెలంగాణాకు కేంద్రం భారీ వరం.. పారిశ్రామిక అభివృద్ధికి భవ్య పథకం!

విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట

దీనికి సంబంధించి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబడతాయని, విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇది సిబ్బందికి భరోసా పెంచుతుందని, కుటుంబాలకు భద్రత కల్పిస్తుందని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం విద్యుత్ శాఖ కార్మికులకు ఇంత స్థాయిలో ప్రమాద బీమా ఇవ్వలేదు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+