'భోగాపురం' లో యూజర్ ఛార్జీలు ఫిక్స్, ఎవరిపై ఎంత- సింగపూర్ కు తొలి విమానం..!!

భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్దం అవుతోంది. ప్రధాని మోదీ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో భోగాపురం లో విమానాల రాకపోకల పైనా.. యూజర్ ఛార్జీల పైన స్పష్టత వచ్చింది. ఏ కేటగిరీ ప్రయాణీకుల నుంచి ఎంత మేర వసూలు చేస్తారో వెల్లడించారు. కాగా, భోగాపురం నుంచి తొలి విమానం సింగపూర్ కు బయల్దేరనుంది.

భోగాపురంలో విమానాశ్రయం ప్రారంభం కానున్న వేళ అన్ని అంశాల పైనా స్పష్టత వస్తోంది. ఇక్కడ విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ సంస్థ (AERA) ప్రయాణికుల వినియోగ రుసుములను ఖరారు చేసింది. యూజర్ డెవలప్ మెంట్ ఛార్జీలు (UDF) ఖరారు చేసారు. దేశీయ (డొమెస్టిక్) ప్రయాణికులపై రూ.835, అంతర్జాతీయ ప్రయాణికులపై రూ. 1,255 చొప్పున యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (UDF) విధించనున్నారు. ఇక విదేశాలు లేదా ఇతర ప్రాంతాల నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే డొమెస్టిక్ ప్రయాణికులు రూ.355, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రూ.545 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుములను విమానాశ్రయ నిర్వహణ, మౌలిక సదుపాయాల వ్యయం కోసమని నేరుగా విమాన టికెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తారు. అయితే, మిగిలిన విమానాశ్రయాల కంటే ఈ ఫీజులు ఇక్కడ ఎక్కువగా ఉండటం పైన సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది.

 అఖిలప్రియకు స్ట్రాంగ్ వార్నింగ్ - భర్త జోక్యంపై చంద్రబాబు సీరియస్..!!
అఖిలప్రియకు స్ట్రాంగ్ వార్నింగ్ - భర్త జోక్యంపై చంద్రబాబు సీరియస్..!!
bhogapuram-airport-fixed-udf-charges-domestic-passengers-to-pay-rs-835-international-rs-1-255

అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుక

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో, ప్రస్తుతం విశాఖపట్నంలోని నావికాదళం పరిధిలో కొనసాగుతున్న పౌర విమానయాన సేవలను పూర్తిగా నిలిపివేసి, వాణిజ్య కార్యకలాపాలను అన్నింటినీ భోగాపురానికే తరలించనున్నారు. ఇక, అత్యవసర సమయాల్లో మాత్రమే విశాఖలోని విమానాశ్రయం వినియోగిస్తారు. కాగా.. భోగాపురం విమానాశ్రయంలో ఆగస్టు 16న సింగపూర్‌ నుంచి ఇక్కడకు విమానం రానుందని, మొదటిగా 17న అర్ధరాత్రి తిరిగి సింగపూర్‌కు బయలుదేరేలా ప్లాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయ ప్రారంభ షెడ్యూల్ ఫిక్స్ అయింది. మొత్తం 2 గంటల 25 నిమిషాలు ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేసారు. భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించారు. ఈ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+