వైసీపీ జడ్పీటీసీగా గెలిచిన రిమాండ్ ఖైదీ..!!
స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షం గా గెలిచిన కూటమి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే విధంగా విజయం సాధించింది. కాగా.. మున్సిపల్ కంటే పల్లె పోరులో వైసీపీ కొంత మేర ప్రభావం చూపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్పీ పీఠం దక్కించుకుంది. కాగా.. జెడ్పీటీసీ ఎన్నికల్లో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత విజయం సాధించటం ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
జెడ్పీపీసీ, ఎంపీటీసీ ఫలితాలు ప్రకటించారు. కూటమి ఒక్క జిల్లా మినహా అన్నింటా విజయం సాధించింది. మున్సిపల్ కంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ పురోగతి సాధించింది. కార్పోరేషన్ ఎన్నికల్లో అనంతపురం ఒక్కటి దక్కించుకున్న వైసీపీ.. జెడ్పీ ఎన్నికల్లో అల్లూరి సీతా రామరాజు జిల్లాను గెలుచుకుంది. కాగా.. రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలానికి చెందిన నెల్లూరు డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. జైలు నుంచే జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిరసనంబేటి చైతన్యకృష్ణారెడ్డిపై 1719 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు ఈ గెలుపు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కుటుంబ సభ్యుల ప్రచారంతో విజయం
నెల్లూరు జిల్లాకు చెందిన సత్యనారాయణ రెడ్డి ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా గత 40 రోజులు గా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. జెడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేసారు. దీంతో, ఆయన జైలులో ఉండటంతో, ఆయన భార్య కామిరెడ్డి ప్రభావతమ్మ, కూతురు కామిరెడ్డి రజని ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల పెట్టిన కేసని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రచారం సమయంలోనూ ఇదే విషయాన్ని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేసారు. ఇప్పుడు జైలులో ఉన్న వ్యక్తి నేరుగా ప్రచారంలోకి రాకపోయినా.. జెడ్పీటీసీగా గెలవటం పైన ఆసక్తి పెరిగింది. ఇక.. నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ రేసు మొదలైంది. ఇక్కడ ఎవరికి జెడ్పీ పీఠం వరిస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications
