దీపావళి వేళ హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - గంటలో రూ.7.9 కోట్లు మాయం!

దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో మరో భారీ సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. చిన్న ఏమరపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్ళు అందిన కాడికి దోచేస్తున్నారు. ప్రభుత్వాలు, సైబర్ క్రైం పోలీసులు ఎంత అలెర్ట్ చేసినా, ఎంత అవగాహన కల్పిస్తున్నా సరే నేరగాళ్ళ ఉచ్చులో నిత్యం అనేకమంది చిక్కుకుంటున్నారు.

తాజాగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రఖ్యాత నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ NBFC 'కీర్తనా ఫిన్‌సర్వ్ లిమిటెడ్' బ్యాంకు ఖాతాను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా రూ.7.9 కోట్లను ఆన్‌లైన్ ద్వారా కాజేసి మోసగాళ్లు కలకలం సృష్టించారు.

Hyderabad cyber fraud at diwali time- Rs 7 9 Crores Looted from NBFC Account in an Hour

నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కీర్తనా ఫిన్‌సర్వ్ సంస్థకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో కార్పొరేట్ ఖాతా ఉంది. నవంబర్ 6వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఈ సైబర్ నేరం జరిగింది. సైబర్ కేటుగాళ్లు ఎలాంటి అనుమానం రాకుండా సిస్టమ్‌ను హ్యాక్ చేసి లేదా ఇతర సాంకేతిక మార్గాలను ఉపయోగించి, మొత్తం 39 అనధికార లావాదేవీల ద్వారా ఈ భారీ మొత్తాన్ని వివిధ ఖాతాలకు మళ్లించినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.

సంస్థ ప్రతినిధి చాగంటి వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 'తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో' అధికారులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితులు ఏ పద్ధతిని అనుసరించారు, మళ్లించిన సొమ్ము ఏయే బ్యాంకు ఖాతాలకు చేరిందనే అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కార్పొరేట్ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీల డిజిటల్ ఖాతాలపై సైబర్ నేరగాళ్ల కన్ను పడుతోంది.

పేదలకు దీపావళి కానుక ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నేటి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ
పేదలకు దీపావళి కానుక ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నేటి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ

మాల్‌వేర్ దాడులు, ఫిషింగ్ లింక్స్ లేదా బ్యాంకు సర్వర్ల లోపాలను ఆసరాగా చేసుకొని ఇలాంటి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పెద్ద ఎత్తున జరిగే మోసాలను నివారించడానికి ఆయా ఆర్థిక సంస్థలు మరింత కఠినమైన టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, రియల్ టైమ్ అలర్ట్స్ మరియు అధునాతన సైబర్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను పాటించడం ఎంతైనా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+