నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం.. శుభవార్త చెప్పిన టీపీసీసీ ప్రెసిడెంట్!

కాంగ్రెస్ నాయకులకు దీపావళి పండుగ వేళ గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్న శుభవేళ త్వరలోనే రాబోతుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సంతోషకరమైన వార్త చెప్పారు.

ప్రభుత్వ కార్పొరేషన్లతో పాటు వివిధ కీలక పదవులకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలకు సంబంధించి త్వరలోనే స్పష్టత రానుండటంతో పార్టీ శ్రేణుల్లో మరియు ఆశావహుల్లో పండుగ వాతావరణం నెలకొంది.హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు, సంస్థాగత పరిస్థితి, నాయకుల పనితీరుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఇప్పటికే అధిష్ఠానానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు.

Nominated Posts telangana Congress started process of nominated posts Corporation Chairman and Director Positions

గతంలో ఉన్నట్లు కాకుండా, ప్రస్తుతం ఏఐసీసీ స్థాయిలో నేతల పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసేందుకు ఒక పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోందన్నారు. నిబంధనలకు అనుగుణంగానే పదవుల భర్తీ ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల భర్తీ అంశంపై పార్టీలో ఇంకా ఎలాంటి అధికారిక చర్చ జరగలేదని మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల విజయంపైనే పార్టీ దృష్టి సారించిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తున్నారని తెలిపారు.

పేదలకు దీపావళి కానుక ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నేటి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ
పేదలకు దీపావళి కానుక ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నేటి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ

పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు మరియు నాయకులకు సముచిత స్థానం కల్పించడమే ధ్యేయంగా నామినేటెడ్ పదవుల భర్తీ ఉండనుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులు, సీనియర్ కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పదవులు భర్తీ చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. త్వరలో ఈ నియామకాలు జరుగుతాయని చెప్పటం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+