రూట్ మార్చిన ప్రధాని మోదీ: సరిహద్దులకు బదులుగా మావోయిస్టుల కంచుకోటలో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూట్ మార్చారు. దేశ సరిహద్దుల్లో భద్రత బలగాలకు బదులుగా ఈ ఏడాది దీపావళి పండుగను ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరుపుకోనున్నారు. మావోయిస్ట్ ప్రభావితం ప్రాంతం ఇది. అక్కడ సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి దీపావళిని వేడుకలను నిర్వహించనున్నారు. దీనికోసం ఆయన ఢిల్లీ నుంచి ఛత్తీస్ గఢ్ కు బయలుదేరి వెళ్లారు. ఇంకాస్సేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా బస్తర్‌లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం నెలకొనడంతో పాటు అభివృద్ధి పనులు జరగుతున్నాయి.

దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న జవాన్ల త్యాగాలు, నిస్వార్థ సేవకు సగౌరవంగా సెల్యూట్ చేయడానికే తాను బస్తర్ పర్యటనకు వెళ్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. బస్తర్ అనగానే మావోయిస్టుల కార్యకలాపాలు మాత్రమే గుర్తుకువచ్చేవి. కొన్నేళ్లుగా భద్రతా బలగాలు చేపట్టిన నిరంతర ఆపరేషన్ల వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారాయి. బస్తర్‌లో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. విద్య, వైద్యం, రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలతో పాటు పర్యాటక రంగం కూడా పుంజుకుంటోంది.

PM Modi all set to celebrate Diwali with Security Personnel in Maoist hit Bastar Chattisgarh today

సుదీర్ఘకాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న స్థానిక గిరిజన ప్రాంతాల్లో క్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ద్విముఖ వ్యూహం సత్ఫలితాలను ఇస్తోంది. హింసామార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి వచ్చే వారికి పునరావాస విధానాల ద్వారా తగిన సాయం అందిస్తుండగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+