దేశ రాజధాని "ఢిల్లీ"లో డేంజర్ బెల్స్.. 483కు చేరిన AQI!

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చలికాలం మొదలవుతున్న వేళ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం బయటకు రావాలంటేనే ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతుండటంతో వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. ఆదివారం ఉదయం పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాలి నాణ్యత సూచీ (AQI) ఏకంగా 483కు చేరడంతో ఢిల్లీ తీవ్ర కాలుష్య స్థాయిలోకి వెళ్లిపోయింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8.10 గంటలకు ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత సూచీ 483గా నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకరమైన కాలుష్య స్థాయి. అంతకుముందు రోజు ఉదయం 8 గంటలకు ఇదే సూచీ 364గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలోనే పరిస్థితి ఇంతగా దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో AQI 400 మార్కును దాటింది.

delhi-on-high-alert-that-aqi-hits-483-as-air-quality-slips-into-severe-category-and-news-got-viral

పలు ప్రాంతాల్లో..

ఢిల్లీలోని బవానాలో 446, పంజాబీ బాగ్‌లో 449, ఆర్కే పురంలో 448, ఐఐటీ ఢిల్లీ పరిసరాల్లో 445, రోహిణిలో 445గా AQI నమోదైంది. చాందినీ చౌక్‌లో 420, పట్పర్‌గంజ్‌లో 421, అలీపూర్‌లో 413గా నమోదైనట్లు CPCB గణాంకాలు వెల్లడించాయి. ఈ ప్రాంతాలన్నీ తీవ్ర కాలుష్య ప్రభావంలో ఉన్నాయి. ఆనంద్ విహార్‌లో 328, నరేలాలో 395గా నమోదయ్యాయి. ఇండియా గేట్ పరిసరాల్లో 398, అక్షరధామ్ ఆలయం వద్ద 336గా గాలి నాణ్యత సూచీ నమోదైంది. ఈ ప్రాంతాలు కూడా అత్యంత దారుణమైన గాలి నాణ్యతతో సతమతమవుతున్నాయి.

పాత వాహనాలకు నో ఎంట్రీ..

కాగా GRAP-3 అమల్లోకి రావడంతో వాహనాల రాకపోకలపై ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లు ఢిల్లీలో తిరగడానికి అనుమతి ఉండదు. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలోని నిర్దేశిత ప్రాంతాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఢిల్లీకి బయట నుంచి వచ్చే కొన్ని పాత డీజిల్ వాణిజ్య వాహనాలపైనా ఆంక్షలు విధించారు. మరోవైపు దుమ్ము ఎక్కువగా వెలువడే నిర్మాణ పనులను నిలిపివేశారు. తవ్వకాలు, భవనాల కూల్చివేతలు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు అనుమతులు నిలిపివేశారు. అత్యవసర పనులకు మాత్రం కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

అలానే కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు, కార్యకలాపాలపైనా అధికారులు దృష్టి సారించారు. దుమ్ము ఎక్కువగా వెలువడే రాళ్ల క్రషర్లను తాత్కాలికంగా మూసివేయడం లేదా వాటి కార్యకలాపాలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు చేపట్టారు. మైనింగ్ కార్యకలాపాలపైనా ఇదే తరహా నియంత్రణలు అమలు చేస్తున్నారు. వాహనాల పొగ, నిర్మాణ పనుల నుంచి వచ్చే దుమ్ము తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.

నాలుగు దశల్లో కాలుష్య నియంత్రణ చర్యలు..

ఢిల్లీలో కాలుష్యాన్ని అదుపు చేసేందుకు GRAP విధానాన్ని నాలుగు దశలుగా అమలు చేస్తారు. AQI 201 నుంచి 300 మధ్య ఉంటే మొదటి దశ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. 301 నుంచి 400 మధ్య ఉంటే రెండో దశ చర్యలు చేపడతారు. 401 నుంచి 450 మధ్య ఉంటే మూడో దశ ఆంక్షలు విధిస్తారు. AQI 450 దాటితే నాలుగో దశకు సంబంధించిన అత్యవసర చర్యలు వర్తిస్తాయి. కాలుష్యం మరింత పెరగకుండా ముందుగానే కఠిన నిబంధనలు అమలు చేయడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం.

ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలపైనా నిఘా

కాలుష్య నియంత్రణ చర్యలు కేవలం ఢిల్లీ నగరానికే పరిమితం కావు. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాలకూ ఈ అత్యవసర ప్రణాళిక వర్తిస్తుంది. వాతావరణ పరిస్థితులు, కాలుష్య తీవ్రతపై భారత వాతావరణ శాఖ (IMD), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (IITM) అందించే అంచనాల ఆధారంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+