పండగ సీజన్ లో పసిడి ధరల్లో అనూహ్య పరిణామాలు

ధన్ తేరాస్ పండుగ వేళ.. బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది. ధన్ తెరాస్ మొదలుకుని, దీపావళ పండగ వరకు వీటి ధరల్లో అనూహ్య తగ్గుదల నమోదైంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో మొత్తం రూ. 3,000 వరకు తగ్గుదల నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్లబంగారం రూ. 1.41 లక్షల వద్దకు చేరుకుంది. అదే సమయంలో కేజీ వెండి ధర కూడా రూ. 4,432 తగ్గి రూ. 1.83 లక్షల స్థాయికి పడిపోయింది.

ధన్ తెరాస్ కు ముందు రోజు అంటే.. గురువారం నాడు పసిడి ధర రూ. 1.44,000 పైమాటే. వెండి ధర రూ. 1.87,000 లక్షలుగా ఉండేది. ఇప్పుడది భారీగా తగ్గింది. ఇదే ట్రెండ్ ఈ వారం మొత్తం కూడా కొనసాగవచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ధన త్రయోదశి నాడే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 2,500 లకు పైగా తగ్గడం మరింత కలిసొచ్చింది. కొనుగోళ్లకు ఊపుతెచ్చింది. ఆ ఒక్క రోజే 60,000 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయి.

Gold and silver prices falls in Festive season in Domestic at MCX for 24K 22K and 18K down size

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,340 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,32,250 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,44,129 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,32,022 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,39,910, రూ.1,32,022 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,44,129, 22 క్యారెట్లు రూ. 1,32,022 వద్ద కొనసాగుతున్నాయి.

నెతన్యాహు అవుట్: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా: రాత్రికి రాత్రి.. !!
నెతన్యాహు అవుట్: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా: రాత్రికి రాత్రి.. !!

పసిడి ధరల్లో స్థిరత్వం ఉన్నప్పటికీ, వెండి ప్రియులకు మాత్రం ఊరట లభించింది. 999 స్వచ్ఛత కలిగిన కిలో వెండి ధర 2.4 శాతం పడిపోయింది. ఒక్కరోజే రూ. 4,430 తగ్గడంతో కిలో వెండి ధర రూ. 1,81,863 కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ తగ్గి రూ. 1,42,364 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ కామెక్స్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,065 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.

విరుచుకుపడుతోన్న సౌదీ అరేబియా- యెమెన్ పై భీకర దాడి
విరుచుకుపడుతోన్న సౌదీ అరేబియా- యెమెన్ పై భీకర దాడి

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,357, 22 క్యారెట్లు - రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,768

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,357, 22 క్యారెట్లు - రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,768

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,357, 22 క్యారెట్లు - రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,768

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,357, 22 క్యారెట్లు - రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,768

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,357, 22 క్యారెట్లు - రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,768

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,357, 22 క్యారెట్లు - రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,768

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+