Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రముఖ నిర్మాతకు అర్దరాత్రి త్రీడి సినిమా, రజనీకాంత్ తో సినిమాలు, పరువు తీసి అధికారులు!

ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు చెందిన రాక్‌లైన్ మాల్‌కు బెంగళూరు మహానగర పాలికె కార్పొరేషన్ (బీబీఎంపీ) అధికారులు తాళం వేశారు. ప్రస్తుతం బెంగళూరులోని దాసరహళ్లిలోని రాక్ లైన్ మాల్‌కు తాళం వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ బాషాల్లో సినిమాలు నిర్మించిన రాక్ లైన్ వెంకటేష్ మాల్ కు తాళం వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

రాక్ లైన్ వెంకటేష్ ఇటీవల కన్నడలో నిర్మించిన కాటేరా సినిమా రూ 200 కోట్లకు పైగా వసూలు చేసింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, రవితేజ తదితరులతో తెలుగు, తమిళ బాషల్లో రాక్ లైన్ వెంకటేష్ సినిమాలు నిర్మించారు. దాసరహళ్లి మండలం బీబీఎంపీ రెవెన్యూ అధికారులు మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత రాక్‌లైన్‌ వెంకటేష్ మాల్‌కు వెళ్లి పోలీసులు, మార్షల్స్‌ సమక్షంలో సీజ్ చేశారు.

BBMP officials have seized the famous producer Rock Line Venkatesh Mall in Bengaluru

రాక్‌లైన్ మాల్‌కు 2011 నుంచి 2022-23 సంవత్సరం వరకు రూ. 11.51 కోట్ల పన్ను బకాయిలు ఉన్నట్లు బీబీఎంపీ అధికారులు అంటున్నారని సమాచారం. ఇప్పటికే అనేకసార్లు రాక్ లైన్ వెంకటేష్ ను నోటీసులు ఇచ్చి పన్ను చెల్లించాలని సూచించామని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. బెంగళూరు మహానగర కార్పొరేషన్‌కు చెందిన రెవెన్యూ అధికారులు చాలా ఏళ్లుగా కోట్లాది రూపాయల పన్ను బకాయిలు ఉండడంతో కమర్షియల్ మాల్స్, భవనాలకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు.

BBMP officials have seized the famous producer Rock Line Venkatesh Mall in Bengaluru

నోటీసులిచ్చినా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో ప్రముఖ సినీ నిర్మాత, నటుడు రాక్ లైన్ వెంకటేష్ మాల్‌ను సీజ్ చేశారు. బీబీఎంపీ కమిషనర్‌ ప్రీతీ గెహ్లాట్‌, జోనల్‌ జాయింట్‌ కమిషనర్‌ బాలశేఖర్‌, దాసరహళ్లి జోనల్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది, మార్షల్స్‌ సమక్షంలో దాసరహళ్లి సమీపంలోని రాక్‌లైన్‌ వెంకటేష్ మాల్‌కు తాళం వేశారు. బెంగళూరు నగరంలోని యలహంక వద్ద 75 ఎకరాల విస్తీర్ణంలో రూ. 85 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ తొలగించింది.

రెవెన్యూ శాఖ, పోలీసుల సహకారంతో బీబీఎంపీ మంగళవారం ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది. బీబీఎంపీకి చెందిన యలహంకలోని 75 ఎకరాల్లో రూ. 85 కోట్ల విలువైన అక్రమాస్తులను అక్రమంగా ఆక్రమించుకుని కట్టాడాలు కట్టారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత నివేదిక రూపొందించారు.

BBMP officials have seized the famous producer Rock Line Venkatesh Mall in Bengaluru

అలాగే సంబంధిత వ్యక్తులకు నోటీసుల ద్వారా సమాచారం అందించారు. ఆక్రమణలకు గురైన స్థలంలో ఆక్రమణదారులు తాత్కాలికంగా షెడ్లు వేసి వాణిజ్య సంస్థలను నిర్వహిస్తున్నారు. నిన్న 140 మంది పోలీసులు, 70 మంది కూలీలు ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఇకపై ఆక్రమణలు జరగకుండా చైన్‌లింక్‌ ఫెన్స్‌ వేయాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+