మంత్రిపై మనస్సు పడ్డ యంగ్ హీరోయిన్..అతనికి ఎవరైనా పడిపోతారంటూ పోస్ట్
సినిమాలను, రాజకీయాలను వేరు చూసి చూడలేము. సినిమా ఇండస్ట్రీ వారితో పొలిటికల్ లీడర్స్ సన్నిహితంగా ఉన్న సందర్భాలు చాలానే చూశాం. తాజాగా ఓ హీరోయిన్ కేంద్రమంత్రిపై మనస్సు పారేసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు. నిషా దూబే.
నిషా దూబే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ భోజ్ పురి వారికి ఈ పేరు సుపరిచితమే. అక్కడ పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఈ అమ్మడు కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌ని ప్రేమిస్తున్నట్లు తెలిపింది. లోక్‌జన శక్తి పార్టీ అధ్యక్షుడుగా చిరాగ్ పాశ్వాన్ కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఘన విజయం సాధించింది. పోటీ చేసిన ఐదు ఎంపీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

దీంతో చిరాగ్ పాశ్వాన్ పేరు దేశ రాజకీయాల్లో మారుమోగింది.ఆయనకు కేంద్రమంత్రి వర్గంలో చోటు కూడా లభించింది. చిరాగ్ పాశ్వాన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను లవ్ చేస్తున్నట్లు నిషా దూబే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.కేంద్రమంత్రిగా చిరాగ్ పాశ్వాన్ ప్రమాణ స్వీకారం చేసిన వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ డైలాగ్ వచ్చేలా కూడా క్రియేట్ చేసింది. ఒక మహిళ ఏమైనా కోరుకోవచ్చు అంటూ నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పిన డైలాగ్ ను ఆ వీడియోకు జత చేసింది.
నిత్యం నవ్వుతూ ఉండే చిరాగ్ పాశ్వాన్ అమాయకత్వపు ముఖం చేస్తే.. ఎవరైనా పడిపోతారని, తన విషయంలో కూడా అదే జరిగిందని క్యాప్షన్ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం నిషా దూబే వయసు 25 ఏళ్లు కాగా.. పాశ్వాన్ వయసు 41 ఏళ్లు. అయినా తనకంటే 16 ఏళ్లు పెద్దైన చిరాగ్ పాశ్వాన్‌ను ప్రేమిస్తున్నట్లు నిషా ప్రకటించింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications