వారం తిరక్కముందే బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్: ట్విస్ట్ అద్దిరింది.. !!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ట్విస్టులపై ట్విస్టులు తెరపైకి వస్తోన్నాయి. హౌస్‌లో ప్రస్తుతం నడుస్తున్న 'మహా పరీక్ష' దశ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఊహించని షాక్‌లు ఇస్తోంది. ఈ క్రమంలోనే మరో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న హౌస్ నుంచి కామనర్ చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు తాజా మరో కంటెస్టెంట్ కూడా హౌస్ ను వీడారు.

బుల్లితెర నటి చైత్ర రాయ్ ఈ వారం మధ్యలోనే హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో రెడ్ టీమ్, బ్లూ టీమ్ గ్రూపుల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఉన్న పోటీ కారణంగా ప్రతి రోజు టాస్క్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఇచ్చిన హై రిస్క్ టాస్క్ వ్యవహారం.. ఈ దఫా చైత్ర ఎలిమినేషన్‌కు దారితీసింది. దీంతో ఆమె హౌస్ ను వీడక తప్పలేదు.

Bigg Boss Telugu Season 10 have eliminated another contestant after Charan from the house Mid Week

ఈ హై రిస్క్ టాస్క్ లో భాగంగా ప్రమాదకరమైన జోన్‌లోకి వెళ్లడానికి హౌస్‌మేట్స్ స్వయంగా నామినేట్ చేసుకునే క్రమంలో చైత్ర రాయ్‌తో పాటు రోహిత్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లలో ఒకరిని కాపాడుకోవడానికి తోటి హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ ఓ సువర్ణ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ మహా పరీక్షలో హౌస్‌లోని మెజారిటీ కంటెస్టెంట్స్ రోహిత్‌కు సపోర్ట్ గా నిలిచారు. అతను హౌస్ లో కొనసాగాలని కోరుకోవడంతో సేఫ్ జోన్‌కు చేరుకున్నాడు. దీనికి భిన్నంగా హౌస్ మేట్స్ నుంచి తగినంత మద్దతు లభించకపోవడంతో చైత్ర రాయ్ ప్రయాణం ఇక్కడితో ముగిసింది.

బిగ్ బాస్ లో ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్- కుర్రాడ్ని మిడ్ వీక్ లోనే పంపించారు
బిగ్ బాస్ లో ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్- కుర్రాడ్ని మిడ్ వీక్ లోనే పంపించారు

వాస్తవానికి.. ఈ సీజన్ ప్రారంభం నుండి చైత్ర రాయ్ ఓ బలమైన కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి అనుగుణంగానే ఆమె హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌ను ఎంతో ఉత్సాహంగా ఫేస్ చేయడం కనిపించింది. ఆమె ఇలా అకస్మాత్తుగా ఎలిమినేట్ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది వ్యూవర్స్ ను.

తిరుమలలో వారికీ డ్రెస్ కోడ్: టీటీడీ తాజా ఆదేశాలు
తిరుమలలో వారికీ డ్రెస్ కోడ్: టీటీడీ తాజా ఆదేశాలు

మిడ్ వీక్ ఎలిమినేషన్ పట్ల నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతోన్నాయి. ఆడియన్స్ ఓటింగ్ లేకుండా ఎలిమినేట్ చేయడం సరికాదని, చరణ్ ను కూడా అలాగే బయటికి పంపించారని గుర్తు చేస్తోన్నారు. ఫస్ట్ వీక్ లో ఎటువంటి ఎలిమినేషన్ ఉండకూడదని, కంటెస్టెంట్లకు కనీసం బిగ్ బాస్ హౌస్ లో కుదురుకోవడానికి, అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికీ కూడా అవకాశం ఇవ్వకపోవడం బాగుండట్లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+