బిగ్ బాస్ లో ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్- కుర్రాడ్ని మిడ్ వీక్ లోనే పంపించారు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అనుక్షణం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్రేక్షకులను టీవీ స్క్రీన్లకు కట్టిపడేస్తోంది. ఈ షో ప్రారంభమైన మొదటివారంలోనే ఊహించని రీతిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ సంభవించింది. కామనర్ కంటెస్టెంట్ ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. భారీ అంచనాలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన అతని ప్రయాణం ఇంత త్వరగా, అర్ధాంతరంగా ముగిసిపోతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.
అతనే.. చరణ్. అగ్నిపరీక్షను అధిగమించి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన ఈ కామనర్ కంటెస్టెంట్.. ఇక్కడ చతికిలపడ్డాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను కంప్లీట్ చేయడంలో విఫలం అయ్యాడు. చివరి రౌండ్‌లో ఆటో రామ్ ప్రసాద్, చరణ్ మిగలగా.. హౌస్‌మేట్స్ మెజారిటీ నిర్ణయం మేరకు చరణ్‌ను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఇది అన్ ఎక్స్ పెక్టెడ్ ఎలిమినేషన్.

ప్రతి సీజన్‌లోనూ ఎలిమినేషన్ ప్రక్రియ వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున సమక్షంలో జరగడం ఆనవాయితీ. ఈసారి మాత్రం దీనికి పూర్తి డిఫరెంట్ గా మిడ్-వీక్ ఎలిమినేషన్ చేపట్టాడు బిగ్ బాస్. సర్ ప్రైజ్ ఇచ్చాడు. మిడ్ వీక్ లో ఇచ్చిన ఓ స్పెషల్ టాస్క్ కారణంగా వీరిద్దరూ ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. చివరికి చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ ను వీడాల్సొచ్చినప్పుడు అతను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
కో కంటెస్టెంట్లతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. హౌస్ మేట్స్ అందరూ గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం తనకు ఇష్టం లేదని, అందరి మధ్య సత్సంబంధాలు ఉండాలన్నదే తన ఉద్దేశమని వెల్లడించాడు. అగ్నిపరీక్షను పూర్తి చేసుకుని కామనర్ కేటగిరీలో అడుగుపెట్టిన చరణ్ ప్రయాణం.. ఇలా అర్ధాంతరంగా ముగియడంపై సానుభూతి వ్యక్తమవుతోంది. చరణ్ ఎలిమినేషన్ నిర్ణయం బిగ్ బాస్ వీక్షకుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే చరణ్ స్థాయిని నిర్ణయించడం సరైంది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఫిజికల్ టాస్క్‌లో చురుగ్గా పాల్గొనకపోవడం, ఆటపై అంతగా అవగాహన లేకపోవడం అతనికి మైనస్‌గా మారాయని నెటిజన్స్ చెబుతున్నారు. హౌస్‌లోని కో కంటెస్టెంట్ లతో చరణ్ ఎక్కువగా మాట్లాడట్లేదని, ఒంటరిగా ఉంటున్నారనే ఒపీనియన్స్ కూడా లేకపోలేదు. కొత్త వాతావరణానికి అలవాటుపడి తనను తాను నిరూపించుకోవడానికి ఆయనకు మరికొంత సమయం ఇవ్వాల్సిందని చెబుతున్నారు.
హౌస్ నుండి చరణ్ నిష్క్రమణతో హౌస్ లో నూతన సమీకరణాలు తెరపైకి వస్తోన్నాయి. సెలబ్రిటీలకు ప్రత్యామ్నాయంగా కామనర్లను నిలబెట్టే ప్రయత్నంలో ఈసారి భిన్న వ్యూహాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇంట్లో త్రిగుణ్, రోహిత్ మధ్య తలెత్తుతున్న విభేదాలు, వాదోపవాదాలు హౌస్ వాతావరణాన్ని వేడెక్కిస్తోన్నాయి.













Click it and Unblock the Notifications
